Begin typing your search above and press return to search.
కార్తీ మాటలు అమ్మకు అగ్రహం తెప్పిస్తాయా..?
By: Tupaki Desk | 12 Dec 2015 5:35 AM GMTతమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉంటాయన్న విషయం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్న పరిస్థితి. ఊహించని విధంగా ఎదురైన ప్రకృతి విపత్తు నేపథ్యంలో తమిళనాడులోని అన్నాడీఎంకే నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. తీవ్రంగా నష్టపోయిన చెన్నై వాసుల్ని ఆదుకునేందుకు దేశ.. విదేశాల నుంచి సాయం అందుతుంటే.. వాటిని మధ్యలోనే అడ్డగించటం.. బెదిరింపులకు పాల్పడటం.. దౌర్జన్యాలు చేయటం లాంటివి చేయటంతో పాటు.. చెన్నై ప్రజలకు వచ్చే ప్రతి సాయంపైనా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోటోలు ఉండేలా చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు గురి చేస్తున్నారు. ప్రచారం మీద పెడుతున్న ఫోకస్.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించకపోవటంపై తమిళ హీరోలు తమదైన శైలిలో పెదవి విప్పటం తెలిసిందే. తాజాగా యువ హీరో కార్తి పెదవి విప్పారు. ఇదే తీరులో స్పందించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో కార్తి మాటలకు తమిళనాడు సర్కారు ఏ విధంగా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
చెన్నైని ముంచెత్తిన వరదల సందర్భంగా.. సాయం కోసం ప్రభుత్వం అర్థించిన వైనాన్ని తప్పు పట్టి.. పన్నులు కట్టే వారి సొమ్ములు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నించి.. సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం విఫలమైన విషయాన్ని చెప్పేశారు. దీంతో ఆగ్రహించిన తమిళనాడు సర్కారు.. ఆయన నివాసం ఉండే ప్రాంతానికి విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తూ ప్రతీకారానికి పాల్పడింది.
స్థానికుల ఒత్తిడికి తలొగ్గిన కమల్ హాసన్ తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవటంతో పాటు.. ప్రభుత్వాన్ని తాను విమర్శించే ఉద్దేశం తనకు లేదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. తన వ్యాఖ్యల కారణంగా ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉంటే అందుకు తాను క్షమాపణలు చెబుతానంటూ చెంపలేసుకున్న తర్వాత కానీ.. విద్యుత్తు పునరుద్ధరణ జరగలేదు. తాజాగా కమల్ హాసన్ మాదిరే కార్తి పెదవి విప్పారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడకుండా ఎవరికి వారు.. తమ నగరాన్ని శుభ్రం చేసుకోవాలని.. ప్రభుత్వం కోసం చూడొద్దని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వచ్చి శుభ్రం చేస్తుందని ఆలోచిస్తూ కూర్చోకూడదని.. ఎవరికి వారు తమకు తోచినంత సాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
యువత క్రియాశీలకంగా వ్యవహరించి రోడ్లను శుభ్రం చేయాలన్నారు. క్లీన్ చెన్నై కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా చేపడితే వ్యాధుల నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన అంటురోగాలు చుట్టుముట్టటం.. అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడొద్దంటూ కార్తీ చేసిన వ్యాఖ్యలు అమ్మ ఈగోను హర్ట్ చేస్తే ఇబ్బంది తప్పదంటున్నారు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన తీరులోనే కార్తీ మాటల మీదా అన్నాడీఎంకే నేతలు ఫైర్ అవుతారా? అన్నది చూడాలి