Begin typing your search above and press return to search.
జగన్ రియల్ హీరో - బాబు నా భ్రమలు తొలగించాడు
By: Tupaki Desk | 31 March 2018 5:39 AM GMTసినిమా వాళ్లకు తమ నటన - సినిమాలే లోకం. దానిని దాటి వారు సాధారణంగా రారు - మాట్లాడరు. కానీ... కొందరు మాత్రం అపుడపుడు స్పందిస్తుంటారు. శివాజీ - నిఖిల్ - ప్రకాష్ రాజ్ - సిద్ధార్థ్ ఇలా కొందరు బయట విషయాలపై కూడా స్పందిస్తుంటారు. వారు రాజకీయంపై మాట్లాడితే జనాలకు ఎక్కడలేని ఆసక్తి. ఈ మధ్యనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో నిఖిల్ తాజాగా రాజకీయాలపై మాట్లాడారు. నాది ఆంధ్రప్రదేశ్ కాకపోయినా... ఓ పౌరుడిగా దేనిపైనా మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నా అంటూ... అమరావతి - జగన్ పై మాట్లాడారు.
*మొన్న అమరావతి ప్రాంతానికి వెళ్లాను. కిరాక్ పార్టీ ప్రమోషన్లో భాగంగా ఆంధ్రకు వెళ్లినపుడు చాలాసార్లు అమరావతి గురించి వినడం వల్ల అదెలా ఉంటుందో చూద్దామని వెళ్లాను. అక్కడేమీ నాకు కనిపించలేదు. అసెంబ్లీ - సచివాలయం కట్టారు గాని నేను విన్నది మాత్రం ఏదీ కనిపించలేదు. ఆ క్షణమే నాకు ఒకటి అర్థమైంది. నా జన్మలో నేను అమరావతి చూడలేను అని* వ్యాఖ్యానించారు.
నిజానికి ఇది నిఖిల్ అభిప్రాయమే కాదు - ఏపీ ప్రజలందరి అభిప్రాయంగా చెప్పొచ్చు. ఎంత కాలం ఇంకా ప్లాన్ల దశలో ఉంటుంది అమరావతి అని నిట్టూరుస్తున్నారు. శంకుస్థాపన వేగంగా వేయడం చూసి ఇంకేముంది సింగ పూర్ వంటి ఒక నగరాన్ని మన వద్ద చూడబోతున్నాం అనే ఆలోచనే అందరికీ క్రేజీగా అనిపించింది. దానిమీద జనం ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎపుడెపుడు అమరావతి కడతారా? ఎపుడు చూద్దామా? అన్న జనం ఆశలు నాలుగేళ్లయినా పనులు మొదలుకాకపోయేటప్పటికి నీరుగారి పోయాయి. నిఖిల్ కు కూడా అందరిలాగానే అనిపించింది. బాబు మూడు నెలలకోసారి మీడియాకు విడుదల చేసే కొత్త కొత్త ప్లాన్ల గురించి చూసి నిఖిల్ చాలా ముచ్చటపడి ఉంటాడు. పాపం అందులో ఒక్క శాతమైనా కనిపించకపోయేటప్పటికి చాలా నిరుత్సాహపడినట్టున్నాడు పాపం.
ఇక జగన్ పై కూడా నిఖిల్ స్పందించారు. "ఎందుకో జగన్ నాకు రియల్ హీరోలా కనిపిస్తారు. రెండు రోజులు జనాల్లో తిరిగితేనే ఎవరైనా అలిసిపోతారు. అలాంటిది 100 రోజులకు పైగా జగన్ ఎండ గాలి పట్టించుకోకుండా జనాల్లో తిరుగుతున్నారంటే నిజమైన హీరో అతను. ఇదేదో జగన్ మీద అభిమానంతో నేను చెప్పడం లేదు. నాకు కనిపించింది, నాకు అనిపించింది నేను చెబుతాను* అని అన్నారు.
గతంలో కూడా ఇతను చాలా ఘాటుగానే స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమం వస్తే జెండా పట్టుకుని తిరుగుతాను అని అప్పట్లో కామెంట్లు చేశారు. అది ఒక విప్లవంలా వస్తే కచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుందని అన్నారు. ఏదమైనా రాజకీయాలపై నటులు స్పందించడం సాహసమే అని చెప్పాలి. కలెక్షన్లు ఎక్కడ దెబ్బతింటాయో అనే భయంతో చాలా మంది నోరు మెదపరు. ఇక పెద్ద హీరోలకైతే హైదరాబాదులో తమ ఆస్తుల భయం.