Begin typing your search above and press return to search.
జగన్ ఇంగ్లిషు మీడియం కు ఆ హీరో ఫుల్ సపోర్ట్
By: Tupaki Desk | 12 Nov 2019 12:25 PM GMTఆదర్శాలు వల్లించటం వేరు.. వాస్తవం వేరన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాము చెప్పే మాటలకు వ్యక్తిగతంగా చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా కొందరు ప్రముఖులు మాట్లాడుతుంటారు. తాజాగా ఏపీలోని సర్కారీ స్కూళ్లలో ఆంగ్ల భాషలో భోదనను తప్పనిసరి చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
అయితే.. ఈ నిర్ణయంపై పలువురు ప్రముఖులు..రాజకీయ నేతలు.. మీడియాలు వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో.. ఈ అంశంపై స్పందిస్తున్న వారి పిల్లలు.. వారి కుటుంబాల్లోని వారు తెలుగు మీడియంలో చదువుతున్నారా? అన్న సూటి ప్రశ్నకు సమాధానం చెప్పని పరిస్థితి. మారిన కాలానికి తగ్గట్లే అందరూ ఇంగ్లిషు నేర్చుకోవటం.. విద్యా బోధన ఇంగ్లీషులో సాగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది నిజం.
కానీ.. ఆదర్శాల పేరుతో నిజాన్ని పక్క దారి పట్టిస్తూ పలువురు ప్రముఖులు మాట్లాడుతున్న వేళ.. అందుకు భిన్నంగా టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధనకు తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆధునిక ప్రపంచంలో ఉద్యోగాలు రావాలన్నా.. ఇతరులతో మాట్లాడాలన్న ఇంగ్లిషు ముఖ్యమని.. ఇంగ్లిషు రాకపోవటంతో చాలామంది విద్యార్థులు తమ ఉన్నత విద్యాభ్యాసంలోనూ.. ఉద్యోగాలు తెచ్చుకోవటంలోనూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని రాజశేఖర్ గుర్తు చేశారు. సమాజంలో అందరికీ విద్య సమానంగా అందాలన్న తన మాటను ట్విట్టర్ లో వెల్లడించారు.