Begin typing your search above and press return to search.
పవన్ తగ్గినా ఆయన తగ్గేటట్లు లేడు
By: Tupaki Desk | 21 Aug 2016 7:52 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని గళం విప్పుతున్న సినీనటుడు శివాజీ తన రూటు మార్చారు. ఇన్నాళ్లు ఆందోళనలు - నిరసనలకు పరిమితం అయిన శివాజీ ఇపుడు రాజ్యాంగ బద్దమైన పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల సభల్లో టీడీపీ-బీజేపీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేసిన జనం నిండా మోసపోయారని పిల్ లో శివాజి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కల్పించడంతోపాటు పునర్విభజన చట్టంలోని హామీలను సక్రమంగా అమలు జరిగేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కానీ ఈ హామీని నిలుపుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైపల్యం చెందిందని శివాజి ఆక్షేపించారు. అందుకే తగు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి - నీతి ఆయోగ్ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేశారు. ఈ కేసు ఈనెల 22న విచారణ కొచ్చే అవకాశం ఉంది.
ఇదిలాఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పోరాటంలో వెనక్కు తగ్గినా శివాజి మాత్రం దూకుడుగా వెళుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవలే ప్రత్యేక హోదా విషయంలో నోరు మెదపని వారిని లక్ష్యంగా చేసుకొని పుష్కరాల్లో శివాజి పిండ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.