Begin typing your search above and press return to search.

లీగ‌ల్ గా న‌న్ను చంపేయండి..పోలీసుల తీరుపై శివాజీ ఫైర్!

By:  Tupaki Desk   |   28 July 2019 12:54 PM GMT
లీగ‌ల్ గా న‌న్ను చంపేయండి..పోలీసుల తీరుపై శివాజీ ఫైర్!
X
న‌టుడు శివాజీ తాజాగా సంచ‌ల‌న వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ మ‌ధ్య‌న గ‌రుడ పురాణంతో పాపుల‌ర్ అయిన ఆయ‌న మాట‌ల‌న్ని.. ఒక వ్యూహంలో భాగ‌మ‌న్న వాద‌న‌ను ప‌లువురు వినిపిస్తూ ఉంటారు. ఆ సంగ‌తిని ప‌క్క‌న పెడితే టీవీ9కు సంబంధించి ఆ సంస్థ మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ తో పాటు.. శివాజీ కూడా కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రించారంటూ స‌ద‌రు మీడియా సంస్థ కొత్త యాజ‌మాన్యం అలంద మీడియా ఆరోప‌ణ‌లు చేయ‌టం తెలిసిందే. ఈ అంశంపై పోలీసుల‌కు వారు ఫిర్యాదు చేశారు.

ఈ నేప‌థ్యంలో టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ను ఇప్ప‌టికే విచారించిన పోలీసులు.. న‌టుడు శివాజీని త్వ‌ర‌లో విచారించే ప‌నిలో ఉన్నారు. ఇదిలా ఉండ‌గా.. ఆయ‌న విదేశాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. దుబాయ్ మీదుగా అమెరికా వెళ్ల‌టానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఆయ‌న్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.

అయితే.. త‌న‌ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేయ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు శివాజీ. త‌న వాద‌న‌తో కూడిన వీడియోను ఆయ‌న విడుద‌ల చేశారు.

అందులో ఆయ‌న తెలంగాణ పోలీసుల‌పై తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టారు. త‌న‌ను లీగ‌ల్ గా చంపేయాల‌న్న మాట‌ను ఆయ‌న అన‌టం గ‌మ‌నార్హం. అధికారులు వ్య‌క్తుల కోసం ప‌ని చేయ‌కూడ‌దంటూ త‌ప్పు ప‌ట్టిన శివాజీ వ్యాఖ్య‌లు పోలీసు శాఖ‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న మీడియా మీట్ పెడ‌తార‌ని చెబుతున్నారు.

ఇక‌.. వీడియోలో ఆయ‌న పేర్కొన్న అంశాల్ని ఆయ‌న మాట‌ల్లోనే చూస్తే..

+ దుబాయ్‌ లో నన్ను అరెస్ట్‌ చేసినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. దుబాయ్ పోలీసులు నన్ను హైదరాబాద్ పోలీసులు అప్పగించారని టీవీ9 వార్తలు వచ్చాయి. ఆ సంస్థ అధినేతలను.. సంబంధిత నేతలను ఏదో విధంగా సంతోష పెట్టడానికే ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారు.

+ లుక్‌ అవుట్‌ నోటీసుల వల్లే నాకు ఈ చిక్కులు వచ్చాయి. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ పరోక్షంగా పోలీసులు ఇబ్బందులు కలిగిస్తున్నారు. అధికారులు సమాజ హితం కోసం పనిచేయాలే తప్ప.. వ్యక్తుల కోసం మాత్రం పనిచేయకూడదు. ప్రైవేట్ పంచాయతీలో పోలీసులకు సంబంధం ఏంటి?

+ గతంలో 50 సార్లకు పైనే అమెరికాకు వెళ్లాను. నేను ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా అన్నీ లీగల్‌గానే వెళ్తాను. అమెరికా పోలీసులకు నా గురించి తెలుసు. తప్పు చేస్తే అన్నిసార్లు నన్ను అమెరికాకు రానిస్తారా..?. ఎప్పుడూ రాని సమస్య ఇప్పుడొచ్చిందంటే.. తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం అమెరికా దాకా వెళ్లింది.

+ రేపొద్దున కోర్టులో ఈ కేసుకు సంబంధించి టీవీ9 క్లిప్‌ చూపిస్తా.. ఈ ఒక్క క్లిప్ చాలు నాకు. ఒక్కొక్కరి సంగతి చెబుతా. అసలు ఏం కేసు ఇది? సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఎన్నికేసులున్నాయ్? ఎన్నికేసుల్లో పురోగతి సాధించారు..? ఎన్ని కేసులు విచారణ చేశారు..? చట్టాన్ని ఇంతలా ఇబ్బందికి గురి చేస్తారా?

+ ప్రస్తుతం న్యాయస్థానం చెప్పినా న‌న్ను అమెరికాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. నాపై ఉన్న కేసులన్నీ తప్పుడు కేసులే. కక్ష సాధిస్తున్నవారిపై సమాజం తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది.