Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌ తో శివాజీ సీక్రెట్ మీటింగ్‌?

By:  Tupaki Desk   |   7 Sep 2016 6:57 AM GMT
ప‌వ‌న్‌ తో శివాజీ సీక్రెట్ మీటింగ్‌?
X
ఏపీ ప్ర‌త్యేక హోదా సాధ‌న క‌మిటీ గౌర‌వ అధ్య‌క్షుడు - టాలీవుడ్ న‌టుడు శివాజీకి జ‌న‌సేన అధ్య‌క్షుడు.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి ఆహ్వానం అందింద‌ట‌! ఇటీవ‌ల కాలంలో ప్ర‌త్యేక హోదాపై ప్ర‌స్తుతం ఏ పార్టీకీ చెంద‌క‌పోయినా.. శివాజీ ఓ రేంజ్‌ లో కామెంట్ల‌తో కుమ్మేస్తున్న విష‌యం తెలిసిందే. అటు టీడీపీ - ఇటు వైకాపా దేనినీ ఆయ‌న వ‌ద‌ల‌ట్లేదు. అవ‌స‌ర‌మైతే, సీఎం చంద్ర‌బాబును సైతం ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు. మొన్నామ‌ధ్య ఏపీకి ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధ‌మైందంటూ టీడీపీ రాజ్య‌స‌భ ఎంపీ సుజ‌నా చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లపై శివాజీ పెద్ద దుమార‌మే రేపారు. దీంతో ఓ రెండు రోజులు ఆయ‌న మీడియాలో హాట్ హాట్‌ గా మారారు. రెండు రోజుల కింద‌ట కూడా ప్ర‌త్యేక హోదాపై శివాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లే చేశారు.

ఇక‌, ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ నుంచి శివాజీకి ఆహ్వానం అందింద‌ని స‌మాచారం. దీంతో హుటాహుటిన ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన శివాజీ ఆయ‌న‌తో సీక్రెట్‌ గా చ‌ర్చంచార‌ట‌. తిరుప‌తి బ‌హిరంగ స‌భ ద్వారా ఏపీకి ప్ర‌త్యేక హోదాపై త‌న క్లారిటీని స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్‌.. ఇక‌పై తాను చూస్తూ కూర్చునే ప‌రిస్థితి లేదని చెప్పార‌ట‌. అదేవిధంగా ఈ నెల 9న కాకినాడ‌లో భారీ బ‌హిరంగ స‌భ కూడా నిర్వ‌హిస్తున్నారు. దీనికి తెలుగువారి ఆత్మ గౌర‌వ స‌భ‌గా ఆయ‌న పేరు పెట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ స‌భ‌మీద అంచెనాలు రెట్టింపు అయ్యారు. ఒక ప‌క్క కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీనే ఇస్తాన‌ని చెప్ప‌డం, దీనికి రాష్ట్రంలో వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డం.. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ లాంటి బ‌ల‌మైన వ్య‌క్తి కూడా ప్ర‌త్యేక హోదా పిలుపునే ఇస్తుండడం రాజ‌కీయంగా ఈ అంశం మ‌రింత రాజుకుంది.

ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు మ‌ద్ద‌తిచ్చేవారిని చేర‌దీయాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతోనే గ‌తంలో ప‌వ‌న్ గుంచి పాజిటివ్‌ గా కామెంట్లు చేసిన శివాజీని ఆయ‌న ఇప్పుడు చేర‌దీసిన‌ట్టు చెబుతున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. . పవన్ ఉద్యమిస్తే ఏపీకి ప్రత్యేక హోదా 3 నెలలో వస్తుందని శివాజీ పలుమార్లు చెప్పాడు. అదేవిధంగా ప‌వ‌న్ లాంటి వ్య‌క్తులు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు అవ‌స‌ర‌మ‌ని కూడా అన్నారు. ఈ నేప‌థ్యంలోనే శివాజీని ప‌వ‌న్ స్వ‌యంగా ఆహ్వానించి సీక్రెట్‌గా ఏవో మంత‌నాలు జ‌రిపార‌ని తెలుస్తోంది. మ‌రో రెండు రోజుల్లో కాకినాడ‌లో భారీ స‌భ నిర్వ‌హిస్తుండ‌డం, ప్ర‌త్యేక హోదాపై కేంద్రం దాట‌వేత ధోర‌ణి అవ‌లంబిస్తుండ‌డంతో ప‌వ‌న్ పొలిటిక‌ల్‌ గా స్టెప్ వేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. దీనిపై తొంద‌ర‌లోనే ఓ క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.