Begin typing your search above and press return to search.

ఓవరాల్ గా.. దమ్ములేనిది రజనీకాంత్ కేనా?

By:  Tupaki Desk   |   17 April 2019 7:47 AM GMT
ఓవరాల్ గా.. దమ్ములేనిది రజనీకాంత్ కేనా?
X
-చిరంజీవి వచ్చాడు తన సత్తా ఎంతో తేల్చుకున్నాడు. ఇక పార్టీ నడపడం సాధ్యం కాదని దాన్ని విలీనం చేసి కామ్ అయిపోయాడు.

- పవన్ కల్యాణ్ మూడో సారి ఎన్నికల ప్రచారం చేశాడు. ఈ సారి తన పార్టీని పోటీలో పెట్టాడు. తను కూడా పోటీలో ఉన్నాడు. పవన్ రాజకీయ భవితవ్యం ఏమిటో మే ఇరవై మూడో తేదీన తెలుస్తుంది. ఎమ్మెల్యేగా నెగ్గి చట్టసభలోకి అడుగుపెడతాడా లేదా.. అనే విషయాలు ఫలితాల రోజున తెలుస్తాయి.

- కర్ణాటకలో ఉపేంద్ర కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తన పార్టీ అభ్యర్థులను పోటీలో పెట్టాడు ఆ హీరో. తను పోటీ చేయకపోయినా లోక్ సభ ఎన్నికలకు తన పార్టీ అభ్యర్థులను పోటీలో పెట్టాడు.

-కమల్ హాసన్ ది కూడా అదే పరిస్థితి. తను ఎక్కడ నుంచి పోటీ చేయడం లేదు కానీ, తన పార్టీని అయితే కమల్ పోటీలో ఉంచాడు. రాజకీయాల్లోకి వచ్చినందుకు ఎంతో కొంత ఓటు బ్యాంకును అయితే కమల్ తన ఖాతాలోకి జమ చేసుకోవడం ఖాయమైంది.

-ఇక రాజకీయంగా కథ అయిపోయిందనుకున్న విజయ్ కాంత్ కూడా తమిళనాట ఈ సారి కూడా ఎన్నికల్లో తన పోరాటం తను చేస్తూ ఉన్నాడు.

-ఇంతమంది సినీ హీరోలు రాజకీయంలోకి వచ్చి ఎంతో కొంత హడావుడి చేస్తూ ఉన్నారు. అయితే ఎటొచ్చీ రజనీకాంత్ మాత్రం ఎలాంటి హడావుడి చేయకపోవడమే ఆశ్చర్యకరంగా ఉంది.

-అలాగని తనకు రాజకీయాలు పడవని - తను రాజకీయాలకు దూరమని రజనీకాంత్ చెబుతున్నాడా - అంటే అలా కూడా లేదు.

-రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అని ప్రకటించారు. ఒకవేళ రజనీకాంత్ కొన్నాళ్ల కిందట ఆ ప్రకటన చేయకపోతే ఇప్పుడు రజనీ గురించి ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు.

-సగం సగం రాజకీయం చేస్తూ ఉన్నారు రజనీకాంత్. కొన్నాళ్ల కిందటేమో ఈ ఎన్నికల్లో తన మద్దతు ఏ పార్టీకి లేదన్నాడు. అయితే ఇటీవల బీజేపీ అధికారంలోకి వస్తే నదుల అనుసంధానం చేస్తుందన్నట్టుగా మాట్లాడాడు.

-ఇలా సగంసగం రాజకీయం చేయడంతోనే రజనీకాంత్ తీరుపై విమర్శలు వస్తూ ఉన్నాయి. వస్తే సూటిగా దిగేయాలని, అమీతుమీ తేల్చుకోవాలని రజనీకాంత్ అభిమానులు కూడా అంటున్నారు. సూపర్ స్టార్ మాత్రం ధైర్యంగా ముందుకు రాలేని వైనం, అలాగని రాజకీయాలకు దూరంగా ఉండలేని తీరును తనే చాటుకున్నాడు!