Begin typing your search above and press return to search.

ఉపేంద్ర రాజ‌కీయానికి దెబ్బ ప‌డింది!

By:  Tupaki Desk   |   19 April 2018 11:02 AM GMT
ఉపేంద్ర రాజ‌కీయానికి దెబ్బ ప‌డింది!
X
సినిమాకు రాజ‌కీయానికి మ‌ధ్య‌నున్న సంబంధం ఎంత బ‌ల‌మైన‌ద‌న్న‌ది తెలుగు ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. సినిమాల్లో స్టార్ డ‌మ్ వ‌చ్చిన చాలామంది రాజ‌కీయాల వైపు మొగ్గుచూప‌టం.. కొంద‌రు ధైర్యం చేసి వ‌చ్చి స‌క్సెస్ అయితే.. చాలామంది ఫెయిల్ అయ్యార‌నే చెప్పాలి. ఎన్టీఆర్ లాంటి వారు త‌ప్పించి తెలుగు నాట సినిమావాళ్లు పార్టీ పెట్టి స‌క్సెస్ అయ్యింది లేదు.

త‌మిళ‌నాడులో సైతం ఇలాంటి ప‌రిస్థితే క‌నిపిస్తుంది. ఇద్ద‌రు.. ముగ్గురు త‌ప్పించి మిగిలిన సినీ ప్ర‌ముఖులు ఎవ‌రూ రాజ‌కీయంగా స‌క్సెస్ అయ్యింది లేదు. ఇదిలా ఉంటే.. క‌న్న‌డ నాట స్టార్ హీరోగా.. రియ‌ల్ స్టార్ గా డిఫ‌రెంట్ ఇమేజ్ ఉన్న న‌టుడు ఉపేంద్ర‌. క‌న్న‌డ స్టార్ గానే కాదు తెలుగులోనూ ఆయ‌న సినిమాలు చేశారు. ఆయ‌న సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి కూడా. ఉపేంద్ర సినిమా అన్నంత‌నే రోటీన్ కి భిన్నంగా ఉంటుంద‌న్న పేరును ఆయ‌న సొంతం చేసుకున్నారు.

సినిమాల‌తో భారీ ఇమేజ్ ఉన్న ఉపేంద్ర ఆ మ‌ధ్య‌న ఆయ‌న రాజ‌కీయ పార్టీ స్టార్ట్ చేశారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న ప్ర‌క‌ట‌న వెంట‌నే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌భావం భారీగా ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని కొంద‌రు వ్య‌క్తం చేశారు. అయితే.. అంత సీన్ లేద‌న్న విష‌యం త‌ర్వాతి ప‌రిణామాలు తేల్చేశాయ‌ని చెప్పాలి.

రీల్ లైఫ్ లోనే కాదు రియ‌ల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకోవాల‌న్న ఆశ‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా ఆయ‌న‌కు అనుకోని రీతిలో ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. ఆయ‌న స్టార్ట్ చేసిన పార్టీ ప్లాష్ షోను మ‌రిపిస్తోంది. గ‌త ఏడాది అక్టోబ‌రులో కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పక్ష (కేపీజేపీ) పేరిట పార్టీ స్టార్ట్ చేశారు. ఎంత స్పీడ్ గా పార్టీ స్టార్ట్ చేశారో అంతే వేగంగా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన వైనం ప‌లువురిని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

పార్టీ స్టార్ట్ చేసిన వేళ‌.. రాష్ట్రంలోని 224 అసెంబ్లీస్థానాల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని చెప్పిన ఉపేంద్ర‌.. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ నుంచే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టం గ‌మ‌నార్హం. పార్టీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి మ‌హేశ్ గౌడ్ తో గొడ‌వ‌లు షురూ కావ‌టంతో ఆయ‌న పార్టీలో ఉండ‌లేక‌పోయారు. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ కొంద‌రు ఉపేంద్ర‌ను ఆరోపించ‌టం.. ఆయ‌న నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌తో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. విలువ‌లు లేని చోట తాను ఉండ‌లేనంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉపేంద్ర త్వ‌ర‌లో మ‌రో కొత్త పార్టీ స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.

ఒక పార్టీని స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన ఉపేంద్ర తాజాగా మ‌రో పార్టీని స్టార్ట్ చేసే యోచ‌న‌లో ఉన్నారు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన ఆయ‌న ప్ర‌జాకీయ పేరుతో కొత్త పార్టీని రిజిష్ట‌ర్ చేశారు. త‌మ పార్టీకి గుర్తించి ల‌భిస్తే 2019 సార్వ‌త్రిక ఎన్నికల్లో పోటీ చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ అభిమాన న‌టుడు ఎన్నిక‌ల బ‌రిలో దిగుతార‌ని త‌ల‌చిన అభిమానుల‌కు ఉపేంద్ర నిరాశ మిగిల్చార‌ని చెప్పాలి. ఇదిలా ఉంటే.. సొంత పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఉపేంద్ర త‌మ పార్టీలో చేరితే స‌ముచితంగా చూసుకుంటామ‌ని చెప్పినా.. ఆ పార్టీల‌లోకి వెళ్ల‌కుండా త‌న బాట‌లోనే తాను న‌డుస్తాన‌ని తేల్చేశారు. మ‌రి.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో ఉపేంద్ర ఎలాంటి ప్ర‌భావం చూపిస్తారో చూడాలి.