Begin typing your search above and press return to search.
ఆ స్టార్ హీరో ఇంటికి బీజేపీ నేతలు పార్సిల్ పంపారు!
By: Tupaki Desk | 28 May 2019 5:23 AM GMTఆచితూచి మాట్లాడితే ఇబ్బందే ఉండదు. అందుకు భిన్నంగా మనసుకు తోచినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. వాటికి రియాక్షన్ గా అంతే తీవ్రంగా చేస్తున్న కామెంట్లు ఇప్పుడు మంట పుట్టిస్తున్నాయి. తాజాగా తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఇంటికి తిరుపూర్ బీజేపీ నేతలు పంపిన పార్సిల్ వ్యవహారం వివాదంగా మారింది.
ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో హీరో విజయ్ తండ్రి కమ్ దర్శకుడు ఎస్ ఏ. చంద్రశేఖర్ బీజేపీని ఉద్దేశించి పరోక్ష విమర్శలు చేశారు. సినిమాను ఎంజీఆర్ మినహా మరెవరూ కాపాడలేరని.. పైరసీదారులకు రాజకీయవాదులే అండగా నిలుస్తున్నట్లుగా మండిపడ్డారు. పోరాటాలతో ప్రభుత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయాలన్న పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ నేతలకు ఎక్కడో తగిలాయి.
ఇదిలా ఉంటే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన మరోసారి బీజేపీ నేతలకు కాలిపోయేలా వ్యాఖ్యలు చేశారు. ఇక.. అందరం కాషాయ వస్త్రాలు చుట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ బీజేపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో.. తిరుపూరు బీజేపీ నేతలు ఆగ్రహంతో విజయ్ ఇంటికి ఒక పార్సిల్ ను పంపారు.
ఈ పార్సిల్ కాషాయ వస్త్రంతో ఉంది. అందులో కాషాయ పంచె.. ఒక లేఖను పంపారు. తాము తొలిసారి కాషాయ పార్సిల్ పంపుతున్నామని.. రానున్న రోజుల్లో అదే పనిగా పంపుతామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కాషాయ వస్త్రాల్ని వేసుకోవాల్సి వస్తున్న పరిస్థితిని ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కదిలించి.. కాలిపోయేలా మాటలు అనిపించుకోవటంలో కొందరు ప్రముఖుల భలేగా ముందుంటారని చెప్పక తప్పదు.