Begin typing your search above and press return to search.
వారంలో హీరో కాస్తా జీరో అయ్యాడా?
By: Tupaki Desk | 12 Dec 2017 12:46 PM GMTదెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మారింది. వారం కిందట వరకూ భారీ ఇమేజ్ తో ఏమైనా చేయగల మొనగాడన్నట్లుగా ఉంటే హీరో విశాల్ గ్రాఫ్ ఇప్పుడు ఒక్కసారిగా తగ్గిపోయింది. వారంలో హీరో కాస్తా జీరో అయిపోయారని చెప్పాలి. ఆమ్మ మరణం తర్వాత ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయటం.. బరిలోకి హీరో విశాల్ దిగటం తెలిసిందే.
ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన తెలుగు మూలాలున్న విశాల్‌కు విజయ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం సాగింది. ఇదిలా ఉండగా.. నామినేషన్ వ్యవహారంనాటకీయ మలుపులు తిరిగి కుదేలు అయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే.. నడిగర్ సంఘంలోనూ నామినేషన్ వ్యతిరేకంగా గళాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. తెలుగువాడైన ఒక వ్యక్తి ఒకవైపు ఎన్నికల్లోనూ మరోవైపు నడిగర్ సంఘంలోనూ చెలరేగిపోవటం ఏమిటన్న చర్చ మొదలైంది. ఒక వర్గానికి ఈ వ్యవహారం అస్సలు నచ్చలేదు.
అంతే.. పావులు కదిలాయి. ఇటీవల జరిగిన నడిగర్ సంఘంలో విశాల్‌కు వ్యతిరేకంగా బలమైన గాలులు వీచాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందు నడిగర్ సంఘంలో ఉన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేయలన్న డిమాండ్ పెరిగింది. విశాల్ రాజీనామా వ్యవహారంపై చేరన్ లాంటోళ్లు మీడియా ముందుకు రావటం.. అదే సమయంలో విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురి కావటం.. విశాల్ కాస్తంత నాటకీయరీతిలో వ్యవహరించటం.. ఎక్కువ హడావుడి చేయటం ప్రత్యర్థులకు ఒక ఆయుధంగా మారింది.
ఈ సమయంలోనే చెన్నైలో జరిగిన నిర్మాతల సమావేశంలో విశాల్‌ను టార్గెట్ చేశారు. వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో జరిగిన పొరపాట్లతోనడిగర్ సంఘం కాస్తా రెండుగా చీలిపోయింది. విశాల్‌ను వ్యతిరేకించే వారుపెద్ద గొడవ చేయటం.. దానికి ధీటుగా సమాధానం చెప్పటంలో విశాల్ తడబడ్డాడు. ఉప ఎన్నికల బరిలో నిలిచిన తన నామినేషన్ తిరస్కృతికి గురి అవుతుందన్న ఆలోచన లేకపోవటం.. ఊహించని రీతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో విశాల్ ఉక్కిరిబిక్కిరి అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాక్టివ్ గా.. దూకుడుగా దూసుకెళ్లే విశాల్ తాజా పరిణామాలతో బేలగా కనిపించటం గమనార్హం. కొన్నిసార్లు అంతే.. అనుకున్నది అనుకున్నట్లు జరగక పోగా.. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. విశాల్‌కు మంచి టైం మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.