Begin typing your search above and press return to search.
ఎలక్షన్ క్యాంపైన్లో స్టార్ హీరో కొత్త సంప్రదాయం
By: Tupaki Desk | 3 May 2018 5:07 AM GMTఎన్నికలు ఎక్కడ జరిగినా విశేషాలకు కొదవ ఉండదు. ప్రస్తుతం పోటాపోటీగా సాగుతున్న కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ ఏ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకొని సిత్రమైన సీన్ ఒకటి కర్ణాటక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంది. ఎవరైనా.. ఎవరికైనా ఒకరి తరఫున మాత్రమే పని చేస్తారు. అందుకుభిన్నంగా ఒక ప్రముఖుడు ఒకే నియోజకవర్గంలోని రెండు భిన్న పార్టీల తరఫు ప్రచారం చేసి సంచలనం సృష్టించిన వైనం చోటు చేసుకుంది. కన్నడ చిత్రాల్లో స్టార్ హీరో అయిన యశ్ అనే నటుడు ఉన్నాడు. అతనికున్న ఇమేజ్ కాస్త ఎక్కువే. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తనకు జానీ జిగిరి లాంటి ఇద్దరు నేతల తరఫున ప్రచారం చేయాల్సి వచ్చింది. ఒకరికి చేసి మరొకరికి చేయకుండా ఉండలేని పరిస్థితి.
అలా అని.. ప్రచారం చేయలేనని చెబితే.. నో .. నథింగ్.. ఏం చేస్తావో తెలీదు.. నువ్వు మాత్రం ప్రచారం చేయాల్సిందేనని జిగిరీ దోస్తులు చెప్పారట. దీనిపై తెగ థింక్ చేసిన సదరు స్టార్ హీరో ఊహించలేని నిర్ణయాన్ని తీసుకున్నారు. తనకు అత్యంత సన్నిహితులైన దోస్తులు పోటీ చేస్తున్న మైసూర్ కేఆర్ నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న రామదాస్ (బీజేపీ).. సారా మహేశ్(జేడీఎస్) ఇద్దరికి ప్రచారం చేయాలని డిసైడ్ చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరికి.. సాయంత్రం నుంచి రాత్రి వరకూ మరొకరికి ప్రచారం చేశారు. పొద్దున వచ్చి.. ఒక అభ్యర్థి తరఫున ప్రచారం చేసి ఓటు వేయాలని చెప్పిన యశ్.. సాయంత్రం నుంచి రాత్రి అయ్యేసరికి ప్లేట్ మార్చేసి.. తన మరో మిత్రుడికి పోటీ చేయాలని కోరారు. ఇలా.. పొద్దున ఒకరికి.. సాయంత్రం మరొకరికి ఓటు వేయాలంటూ చెప్పిన తీరు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఆసక్తికర చర్చకు తెర తీసింది. మరి.. యశ్ ప్రచారం చివరకు ఏం చేస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.