Begin typing your search above and press return to search.
సుందరాంగులు షవర్ బాత్ మానేశారట
By: Tupaki Desk | 23 April 2016 5:30 PM GMTఎప్పుడూ లేని విధంగా ఈ వేసవిలో దేశ వ్యాప్తంగా కరవు పరిస్థితులు చోటు చేసుకోవటమే కాదు.. తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే.. నీటి కొరతను మర్చిపోయిన రాజకీయ నేతలు.. పలువురు సెలబ్రిటీలు నీటిని వృధా చేసి అడ్డంగా బుక్ కావటమే కాదు.. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే దీనికి భిన్నంగా వ్యవహరించటమే కాదు.. తమలో వచ్చిన మార్పుల్ని బయటకు చెప్పి.. అందరి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశారు కన్నడ భామలు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. బయట పరిస్థితుల గురించి తెలిసిన నేపథ్యంలో తాము నిత్యం చేసే షవర్ బాత్ ల్ని బంద్ చేసినట్లుగా వెల్లడించారు సంజన.. మయూరి.. సుకృతలు.
ఎన్నో గ్రామాల్లో గుక్కెడు నీళ్ల కోసం జనాలు పడుతున్న బాధలు తమను విపరీతంగా కదిలించి వేశాయని.. అందుకే షవర్ బాత్ కు కొద్దిరోజులుగా బంద్ చేసినట్లు వారు వెల్లడించారు. సమాజంలో చైతన్యం పెంచేందుకు తాము చేసిన పనిని బయటకు చెబుతున్నట్లుగా వెల్లడించారు. అంతాబాగానే ఉంది కానీ.. అలవాటులో పొరపాటున నీళ్లను వృధా చేస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ఈ ముగ్గురు భామలు గుర్తుంచుకుంటే మంచింది. ఏమైనా.. నీటి కొరతను గుర్తించి తమకు తాముగా షవర్ బాత్ లను బంద్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం అభినందనీయమని చెప్పకతప్పదు.