Begin typing your search above and press return to search.
హర్షల్ పటేల్ సంచలనం .. హ్యాట్రిక్ తో నయా చరిత్ర
By: Tupaki Desk | 27 Sep 2021 5:40 AM GMTఐపీఎల్ 2021 సెకండాఫ్ అంచనాలకు అందకుండా దూసుకుపోతోంది. హాట్ ఫేవరేట్స్ ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో ఏడో స్థానానికి పడిపోయింది. మరోవైపు అద్భుత విజయంతో.. మూడో స్థానానికి దూసుకెళ్లింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇక, ఈ మ్యాచ్ లో RCBకి చెందిన హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ 2021 సీజన్‌లో హ్యాట్రిక్ సాధించాడు.
ముంబై ఇండియన్స్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్ సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ పడగొట్టాడు. 17వ ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా (3)ను, రెండో బంతికి కీరన్ పోలార్డ్ (7), మూడో బంతికి రాహుల్ చహర్ (0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలో ఆర్‌సీబీ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ (రాజస్థాన్ రాయల్స్ 2010), శామ్యూల్ బద్రీ (ముంబై ఇండియన్స్ 2017)లు బెంగళూరు తరఫున హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.
ఇక ఐపీఎల్ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన 20వ బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నీలో మొదటగా హ్యాట్రిక్ తీసింది లక్ష్మిపతి బాలాజీ. 2008లో అప్పటి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుపై బాలాజీ హ్యాట్రిక్ పడగొట్టాడు. అమిత్ మిశ్రా, మఖయ ఎంతినిలు కూడా 2008లోనే ఈ ఫీట్ అందుకున్నారు. 2009లో యువరాజ్ సింగ్ రెండు సార్లు, రోహిత్ శర్మ ఓసారి హ్యాట్రిక్ తీశారు.
ప్రవీణ్ కుమార్ (2010), అమిత్ మిశ్రా (2011), అజిత్ చండీలా (2012), 2013లో అమిత్ మిశ్రా, సునీల్ నరైన్ హ్యాట్రిక్ పడగొట్టారు. 2014లో ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్.. 2016లో అక్షర్ పటేల్.. 2017లో శామ్యూల్ బద్రి, ఆండ్రూ టై మరియు జయదేవ్ ఉనద్కట్.. 2019లో సామ్ కరన్, శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ తీశారు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 54 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో గ్లెన్ మాక్స్‌వెల్ (56: 37 బంతుల్లో 6X4, 3X6), విరాట్ కోహ్లీ (51: 42 బంతుల్లో 3X4, 3X6) అర్ధ సెంచరీలతో రాణించారు. శ్రీకర్ భరత్ (32) ఫర్వాలేదనిపించాడు. ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (43), క్వింటన్ డికాక్ (24) పరుగులు చేశారు. మిగతావారు విఫలమవడంతో రోహిత్ సేన భారీ తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్ దిశగా దూసుకెళ్లగా.. ముంబై పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచులో ఆర్ సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 10000 పరుగులు పూర్తిచేసిన తొలి భారత బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతికి బౌండరీ బాదడంతో కోహ్లీ టీ20ల్లో 10,000 పరుగులు పూర్తిచేశాడు. టీమిండియా (టీ20 మ్యాచులు), ఢిల్లీ (దేశీయ క్రికెట్), బెంగళూరు (ఐపీఎల్) జట్లకు ఆడుతూ కోహ్లీ పదివేల రన్స్ చేశాడు. టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ ముందున్నాడు. యూనివర్స్ బాస్ 446 మ్యాచ్ లలో 22 సెంచరీలు మరియు 87 అర్ధ సెంచరీలతో 36.94 స్ట్రైక్ రేట్ తో 14,261 పరుగులు చేశాడు.