Begin typing your search above and press return to search.
కిల్లిని పేరు పెట్టి పలుకరించి స్వీట్ షాకిచ్చిన సోనియా!
By: Tupaki Desk | 8 Aug 2019 10:09 AM GMTరాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్నటోళ్లు ఉండరన్న నానుడి తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే తాజా ఉదంతాన్ని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉండేదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. విభజనకు కాస్త ముందు.. తర్వాత పూర్తిగా కకావికలమైందా పార్టీ. విభజన వేళలో ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేకున్నా.. తర్వాతి కాలంలో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ముఖ్యనేతలంతా టీఆర్ ఎస్ లోకి చేరిపోయారు. ఇప్పటికి పలువురు నేతలు కాంగ్రెస్ లో ఉన్నా.. బలమైన.. ప్రజాకర్షణ శక్తి ఉన్న నేతలు టీఆర్ ఎస్ లో చేరిపోయారు.
ఇదిలా ఉంటే.. యూపీఏ 2లో కేంద్రమంత్రిగా వ్యవహరించారు ఏపీకి చెందిన కాంగ్రెస్ నేత కిల్లి కిల్లి కృపారాణి. తర్వాతి కాలంలో ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మోడీతో భేటీ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పార్టీ నేతలు పార్లమెంటు కారిడార్ లో వెళుతున్నారు. ఆ బ్యాచ్ లో కిల్లి కృపారాణి ఉన్నారు.
అదే సమయంలో వారికి ఎదురయ్యారు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఎదురయ్యారు. కిల్లిని చూసిన సోనియా ఆమెను గుర్తించి.. హాయ్ కిల్లి కృపారాణి.. ఎలా ఉన్నారు? ఇంతకాలం ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు పార్టీ మారారు కదా? ఇప్పుడే పార్టీలో ఉన్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఊహించని రీతిలో సోనియా గాంధీ నుంచి వచ్చిన పలుకరింపుతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిన కిల్లి.. సమాధానం చెప్పే లోపే.. మీరిప్పుడు వేరే పార్టీలో ఉన్నారు కదా అంటూ వెళ్లిపోయారు.
తన తల్లి పలుకరించిన కిల్లి కృపారాణిని రాహుల్ గాంధీ గుర్తించలేదు. ఎవరన్న ఆయన ప్రశ్నకు.. యూపీఏ 2లో ఆమె మంత్రిగా పని చేశారని సోనియా రాహుల్ కు వివరించటం కనిపించింది. సోనియా అంతటి నేత తనను గుర్తించి పలుకరించిన వైనంపై ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజకీయాల్లో శాశ్విత శత్రువులు.. మిత్రులు ఎవరూ ఉండరన్న విషయం తాజా ఎపిసోడ్ ను చూసినంతనే అర్థం కాక మానదు.