Begin typing your search above and press return to search.

అమీర్ పేటలో విదేశీ గర్ల్స్ తో వ్యభిచారం.. గుట్టు రట్టు

By:  Tupaki Desk   |   3 April 2019 6:02 AM GMT
అమీర్ పేటలో విదేశీ గర్ల్స్ తో వ్యభిచారం.. గుట్టు రట్టు
X
హైదరాబాద్ లో విదేశీ మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. తాజాగా అమీర్ పేటలోని స్టార్ హోటళ్లలో విదేశీ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సమాచారం అందుకున్న పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు విదేశీ యువతులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరంతా ఉజ్బెకిస్తాన్ కు చెందిన యువతులు అని పోలీసుల విచారణలో తేలింది.

అమీర్ పేటలోని ఆదిత్య పార్క్ హోటల్ లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి ఈ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నారు. హోటల్ నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను పట్టుకున్నారు. అలాగే పంజాగుట్టలోని పోలో లాడ్జిపైనా ఇదే తరహా దాడులు చేసి ఉజ్బెకిస్తాన్ కు చెందిన నలుగురు యువతులు, బెంగాల్ కు చెందిన యువతి, నలుగురు విటులను పట్టుకున్నారు.

అయితే పోలీసులు దాడులు చేసే సమయంలో పసిగట్టిన కొందరు నిర్వాహకులు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సూర్య, రాహుల్ అనే ఇద్దరు నిర్వాహకులు ఈ దందా నిర్వహిస్తున్నారని.. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరి వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా విడిచిపెట్టమని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు.