Begin typing your search above and press return to search.

భారీ కుట్ర భగ్నం..ఏడుగురు మావోయిస్టుల అరెస్ట్

By:  Tupaki Desk   |   24 Sept 2018 1:57 PM IST
భారీ కుట్ర భగ్నం..ఏడుగురు మావోయిస్టుల అరెస్ట్
X
విశాఖ మన్యంలో మావోయిస్టుల దారుణ మారణకాండను మరిచిపోకముందే మరో భారీ కుట్ర బయటపడింది. ఏపీకి పొరుగున ఉన్న చత్తీస్ ఘడ్ లో మరోసారి పంజా విసిరేందుకు మావోలు సిద్ధమయ్యారు. అయితే ముందే అప్రమత్తమైన పోలీసులు ఈ కుట్రను చేధించారు.

నారాయణపూర్ అడవుల్లో భారీ మావోయిస్టు డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులు, పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు - పైప్ బాంబ్స్ ను నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన ఏడుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు.

మరో వైపు అరకు ఎమ్మెల్యే హత్యకు ప్రతికారంగా దాదాపు 25 పోలీస్ గ్రేహౌండ్స్ బలగాలు ఏవోబీలో కూంబింగ్ కు దిగాయి. ఎమ్మెల్యే చంపిన వారి కోసం వెతుకుతున్నాయి. దీంతో చత్తీస్ ఘడ్ అడవుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వెంటాడుతోంది. అటు మావోలు - ఇటు పోలీసుల బూట్ల చప్పుడుతో మన్యంలోని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.