Begin typing your search above and press return to search.

ఏపీలో మద్యం విక్రయాలపై హైకోర్టు లో ఫీల్..!

By:  Tupaki Desk   |   11 May 2020 12:10 PM GMT
ఏపీలో మద్యం విక్రయాలపై హైకోర్టు లో ఫీల్..!
X
ఏపీలో మద్మం అమ్మకాలపై పెద్ద దుమారం రేగుతోంది. ఇప్పటికే మద్యం విక్రయాలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. రాష్ట్రంలో మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలను వెంటనే ఆపాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ మద్యం విక్రయాలకు వ్యతిరేకంగా మాతృభూమి ఫౌండేషన్‌తో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్ ‌లపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది.

కరోనా విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలకు అనుమతించడం సరికాదని.. తద్వారా కరోనా వ్యాపించే ప్రమాదముందని పిటిషనర్ల తరపు న్యాయవాది బీఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదించారు. మద్యం అమ్ముతూ క్యూలలో భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మద్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది అని పిటీషనర్ తరుపు న్యాయవాది వాదించారు. అలాగే, ఏపీ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పిందని.. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఇదే సరైన సమయమని లాయర్ అభిప్రాయపడ్డారు.

దీనిపై వాదనలను వినిపించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్సష్టం చేశారు. దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నామని.. ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని కోర్టు వివరించారు. సామాన్యులకు మద్యం అందకుండా భారీగా ధరలను పెంచడంతో పాటు షాపుల సంఖ్యను కూడా తగ్గించినట్లు చెప్పారు. ఇరువురి వాదనలను విన్న హైకోర్టు.. బుధవారం లోపు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.