Begin typing your search above and press return to search.

హిడ్మా చనిపోలేదు..! లేఖ విడుదల చేసిన మావోయిస్టులు..

By:  Tupaki Desk   |   12 Jan 2023 9:30 AM GMT
హిడ్మా చనిపోలేదు..! లేఖ విడుదల చేసిన మావోయిస్టులు..
X
మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందాడన్న వార్తలపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో ఓ లేఖ విడుదలైంది. ఇందులో హిడ్మా సేఫ్ గానే ఉన్నాడని పేర్కొన్నారు.

పోలీసులు దక్షిణ బస్తర్ కొండలపై డ్రోన్ లు, హెలీక్యాప్టర్లు ద్వారా దాడులు చేశారని కానీ ఈ దాడుల్లో హిడ్మా చనిపోలేదని తెలిపారు. తమన దెబ్బతీయాలని కేంద్ర హోంశాఖ ఎన్నో పన్నాగాలు వేస్తుందని, కానీ అటువంటి సందర్భం ఎన్నటికి రాదని పేర్కొన్నారు. పాలకులకు వ్యతిరేకంగా ప్రగతి శీల కూటములు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా హిడ్మా మరణించారని అటు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు. కొన్ని మీడియా సంస్థల్లో మాత్రం హిడ్మా చనిపోయినట్లు ప్రసారం చేశారు. అయితే మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆపరేషన్లు చేపడుతున్నట్లు ఛత్తీస్ గఢ్ సెక్టార్ ఐజీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన నేపథ్యంలోనే ఈ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఈ ఆపరేషన్లు కొనసాగుతాయిన పోలీసులు పేర్కొంటున్నారు.

ఇక మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్న హిడ్మా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1996లో మావోయిస్టులో చేరిన ఆయన అంచెలంచెలుగా గెలిల్లా కార్యాకలాపాల్లో నిపుణుడిగా పొందాడు. అతనిపై ప్రస్తుతం 45 లక్షల రివార్డు ఉంది.

2021 ఏప్రిల్ లో 22 మంది భద్రతా సిబ్బందిని చంపిన దాడిలో హిడ్మా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. బీజాపూర్, సుక్మా ప్రాంతాల్లో భద్రతా బలగాలపై జరిగిన దాడుల్లో అనుమానితుడిగా ఉన్నాడు.

హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్ కు నాయకత్వం వహిస్తున్ానడు. ఇందులో 180 నుంచి 250 మంది మావోయిస్టు ఫైటర్స్ ఉన్నారు. 21 మంది సభ్యులున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు హిడ్మానే. హిడ్మా బృందాలు చేసిన అనేక ప్రాంతాక దాడుల్లో మే 2013లో కాంగ్రెస్ కాన్వాయ్ పై జీరామ్ వ్యాలీ ఆకస్మిక దాడి ఒకటి. ఇందులో చాలా మంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చనిపోయారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.