Begin typing your search above and press return to search.

ఏపీకి పొంచి ఉన్న పెను ప్రమాదం..,దూసుకొస్తున్న తుపాన్ ..72 గంటల్లో!

By:  Tupaki Desk   |   4 May 2020 7:30 AM GMT
ఏపీకి పొంచి ఉన్న పెను ప్రమాదం..,దూసుకొస్తున్న తుపాన్ ..72 గంటల్లో!
X
ఆంధ్రప్రదేశ్ లో ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూ అందరిని ఆందోళనకి గురిచేస్తుంటే ..మరోవైపు ఏపీకి భారీ ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తుపాను ముప్పు పొంచి ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని , ఇది మరింత బలపడి సుమారుగా మే 7 వ తేదీన ఆగ్నేయబంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫాన్ కి ఎంఫాన్ (AMPHAN) గా వాతావరణ శాఖ నామకరణం చేసారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్ప‌పీడ‌నం మ‌రో 72 గంట‌ల్లో అది వాయుగుండంగా మార‌డానికి అవ‌కాశాలు ఉన్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. వాయుగుండంగా మారిన త‌రువాత అది వాయువ్య దిశగా కదిలే అవ‌కాశం ఉన్న‌ట్లు భావిస్తున్నారు.

ఈసీఎండ‌బ్ల్యూఎఫ్‌ అంచ‌నా ప్ర‌కారం..ఈ నెల 13వ తేదీ నాటికి మ‌య‌న్మార్ వ‌ద్ద తీరాన్ని దాటే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిప్రభావం వల్ల ఏపీ, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు. ఈ మూడు రాష్ట్రాలకు చెందిన మ‌త్స్య‌కారులు చేప‌ల‌వేట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని తెలిపింది. తుఫాన్ ప్ర‌భావం వ‌ల్ల ఉత్త‌రాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో వ‌చ్చే 48 గంట‌ల్లో మెరుపులు , ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఇప్పటికే కరోనా తో అల్లాడుతున్న ప్రజలకు, మరోవైపు తుపాను హెచ్చరికలు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అలాగే వాతావరణ శాఖ చెప్పినట్టే ఒక్కసారిగా వైజాగ్ లో వాతావరణం పూర్తిగా మారి పోయింది. ఆకాశం పూర్తిగా మేఘాలతో నిండి పోయింది.