Begin typing your search above and press return to search.

బీజింగ్ లో హై అలర్ట్

By:  Tupaki Desk   |   25 April 2022 11:30 PM GMT
బీజింగ్ లో హై అలర్ట్
X
కరోనా వైరస్ దెబ్బకు చైనా రాజధాని బీజింగ్ లో డ్రాగన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇంతకాలం షాంఘై నగరంతోనే ఇబ్బంది పడుతున్న ప్రభుత్వానికి ఇపుడు బీజింగ్ కూడా తోడయ్యింది. దీంతో కరోనా వైరస్ కేసుల ముప్పు మరింతగా పెరిగిపోతోందని అర్ధమైంది. ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కేసులు ఎలా పెరుగుతున్నాయో అర్ధంకాక డ్రాగన్ ప్రభుత్వం తలపట్టుకుంటోంది.

గడచిన వారం రోజులుగా బీజింగ్ లో కేసుల తీవ్రత పెరిగిపోతోంది. స్కూళ్ళు, వర్క్ స్టాట్స్, ఆఫీసులు, పర్యాటకుల కారణంగా వైరస్ సోకటం ఎక్కువైపోతోందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ అనుమానంతోనే పర్యాటకులు, కార్మికులు, స్కూళ్ళల్లో విద్యార్ధులకు మూకుమ్మడి పరీక్షలు చేయాలని డిసైడ్ అయ్యింది. కీలక ప్రాంతాల్లోని జనాలకు న్యూక్లియక్ యాసిడ్ పరీక్షలు, క్లస్టర్లుగా గుర్తించిన ప్రాంతాల్లోని స్కూళ్ళను మూయించేయాలని డిసైడ్ చేసింది.

వైరస్ ఎలా సోకుతోందో అర్ధం కాకపోయినా తొందరలోనే కోవిడ్ తీవ్రత మాత్రం పెరిగిపోయే ప్రమాదముందని పెకింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాంగ్ యుఏడెన్ ఆందోళన వ్యక్తంచేశారు. మే డే కారణంగా రాబోయే వారం సెలవు రోజుల్లో లక్షల సంఖ్యల జనాలు ప్రయాణాల కారణంగా కోవిడ్ వ్యాప్తి మరింతగా పెరిగిపోయే అవకాశముందని ప్రభుత్వంలో కూడా టెన్షన్ పెరిగిపోతోంది.

ఈ సమస్య ఇలాగుంటే షాంఘైలో ఒకేరోజు 39 మంది వైరస్ తో చనిపోవటం దేశంలో కలకలం రేపుతోంది. షాంఘైలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. షాంఘైలో వైరస్ నియంత్రణకు చైనా ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నది.

ఈ ఆంక్షలను తట్టుకోలేక జనాలు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సరే దేశ క్షేమం కోసం నిబంధనలు అమలు చేసి తీరాల్సిందే అని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. ఇంతలా నిబంధనలను అమలు చేస్తున్నా కేసుల సంఖ్య ఎలా పెరుగుతోందో అర్ధం కావటం లేదు.

జంతువులను బోన్లలో ఉంచి బంధించినట్లుగా జనాలను ప్రభుత్వం ఇళ్ళకే పరిమితం చేసేసింది. ఇంతకాలం షాంఘై మాత్రమే అనుకుంటే ఇపుడు బీజింగ్ కూడా తోడవ్వటంతోనే ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది.