Begin typing your search above and press return to search.
పాతబస్తీలో హైఅలెర్ట్: అక్బరుద్దీన్ కు శిక్ష పడుతుందా?
By: Tupaki Desk | 12 April 2022 10:30 AM GMTఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విద్వేషపూరి వ్యాఖ్యల కేసులో కోర్టు తుది తీర్పుకు సిద్ధమైంది. తాజాగా వాదనలు అన్నీ పూర్తి కావడంతో తుది తీర్పును వాయిదా వేసింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. నాంపల్లి కోర్టులో 30 మంది సాక్ష్యులను కోర్టు విచారించింది.
కోర్టుకు అక్బరుద్దీన్ తోపాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తీర్పు వస్తుండడంతో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. అయితే విద్వేషపూరిత వ్యాఖ్యలపై తీర్పు రేపటికి వాయిదా పడడంతో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.
పదేళ్ల కిందట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్ర వివాదాస్పద వ్యాక్యలు చేశారు. రెండు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఆయన వ్యాఖ్యలున్నాయి. రాజకీయ పార్టీల మధ్య పెంచేలా ఉన్నాయంటున్నారు. కోర్టు దాకా ఈ వ్యవహారం వెళ్లింది. దాదాపు పదేళ్ల పాటు విచారణ సాగింది. ఇప్పుడామాటపై న్యాయస్థానం అంతిమ తీర్పునకు రెడీ అయ్యింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.
అప్పటి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో పదేళ్ల క్రితం ఎంఐఎం సభ నిర్వహించారు. నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ సభలో కార్యకర్తలు, ఆ వర్గాన్ని ఉత్తేజ పరిచేందుకు అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్లు మాత్రమే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో తక్కువో చూపిస్తాం' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాడు పోలీసులు సుమోటోగా తీసుకొని అక్బరుద్దీన్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న ప్పుడు ఏకంగా అక్బరుద్దీన్ అరెస్ట్ చేయించి 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించేలా చేశారు.
40 రోజుల పాటు జైలు జీవితం గడిపిన అనంతరం అక్బరుద్దీన్ బెయిల్ పై బయటకు వచ్చారు. పదేళ్ల పాటు ఈ కేసు విచారించిన నాంపల్లి కోర్టు రేపు బుధవారం తుదితీర్పును వెలువరించనుంది. దీంతో ఈ కేసులో అక్బరుద్దీన్ కు శిక్ష పడుతుందా? కోర్టు మన్నించి తక్కువ శిక్షతో వదిలేస్తుందా? లేక కఠినంగా వ్యవహరిస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది. ముందుజాగ్రత్త చర్యగా పాతబస్తీలో హైఅలెర్ట్ ను పోలీసులు ప్రకటించారు.