Begin typing your search above and press return to search.
రాజధాని లో హై అలర్ట్ ... టెన్షన్ టెన్షన్ !
By: Tupaki Desk | 27 Dec 2019 8:59 AM GMTఆంధప్రదేశ్ రాజధాని గా అమరావతి నే కొనసాగించాలి అంటూ , అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు పదో రోజు కు చేరకున్నాయి. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం ఉండటంతో ఈ భేటీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్న ప్రాంతానికి కొంచెం దగ్గర లోనే మంత్రి వర్గ సమావేశం జరుగుతుండటం తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సెక్రెటేరియట్, అసెంబ్లీ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శాంతియుత నిరసనలకు పోలీసులు అనుమతించారు. సచివాలయంకు వెళ్లే మార్గాల్లోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన టెంట్ల ను పోలీసులు తొలగించారు.
మందడం, తుళ్లూరు, వెలగపూడి తో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు. అత్యవసరమైన పాలు, మందుల షాపుల్ని మాత్రమే తెరిచేందుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం అమరావతి ప్రాంతం పోలీసుల ఆధీనంలో ఉంది. కేబినెట్ సమావేశం జరిగే ప్రాంతంలో రైతులు నిరసనలు తెలిపే అవకాశం ఉందనే హెచ్చరికలతో భద్రత ను కట్టుదిట్టం చేశారు. నిడమర్రు సమీపంలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ బస్సు అద్దాల ను రైతులు ధ్వంసం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడగా.. పోలీసులు రంగం లోకి దిగడం తో పరిస్థితి సద్ధుమణిగింది.
ఇటు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అమరావతి రైతుల ఆందోళనల కు మద్దతు గా మౌనదీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెం లో రాజధాని కోసం ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలం లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం దీక్ష ప్రారంభించారు. ఈ దీక్ష సమయంలో ఆయనతో మాట్లాడటానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై అక్కడ ఉన్న జనం దాడి చేసారు. ఆ దాడి ని అడ్డుకున్న పోలీసులపై కూడా దాడులకు దిగారు. దీనితో పలువురికి గాయాలైయ్యాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది.