Begin typing your search above and press return to search.
ఏపీ సినిమా టికెట్ల నియంత్రణ జీవో పై హైకోర్టు ఏం చెప్పిందంటే..?
By: Tupaki Desk | 5 Oct 2021 8:00 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ రేట్ల పెంపు నియంత్రణ విధానం తీసుకొస్తూ జీవో నెం. 35 జారీ చేసిన సంగతి తెలిసిందే. రూరల్ ఏరియాల్లో టికెట్ రేట్స్ ప్రభుత్వమే నిర్ణయించి.. చిన్న సినిమా నిర్మాతల ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈ జీవోను జారీ చేసింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.100 మించకుండా కట్టడి చేసింది. థియేటర్ల టికెట్ల రేట్లను నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 అమలు సరిగా జరగడం లేదంటూ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే నట్టి కుమార్ వేసిన పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. జీవో నెం. 35 ను అధికారులు అమలు పరచాలని చెబుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లాలోని కొందరు థియేటర్ యజమాన్యాలు 35 నెం. జీవోను అమలుపరచకుండా తమ ఇష్టానుసారంగా అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడంపై నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ప్రజల సొమ్ము దోపిడీ చేయడంతో పాటు కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని.. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నట్టికుమార్ హైకోర్టు కు వెళ్లారు. సినిమా టికెట్స్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్మాత పిటిషన్ లో పేర్కొన్నారు.
కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు రూ. 35 టిక్కెట్లను 100 రూపాయలకు బహిరంగంగా అమ్ముతున్నారని.. ఈ బ్లాక్ మార్కెట్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మార్వో - ఆర్డీవో లకు విన్నవించినా ఫలితం లేకపోయిందని.. అందుకే కోర్టును ఆశ్రయించానని నట్టికుమార్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో టికెట్ల అమ్మకాల విషయం పై వాదనలు విన్న హైకోర్టు సోమవారం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 పై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ - అనకాపల్లి ఆర్డీవోకి ఆదేశాలు జారీ చేసిందని నట్టి కుమార్ మీడియాకు తెలిపారు. కోర్టు ఆదేశాలతో చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు మేలు జరుగుతుందని నట్టి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.