Begin typing your search above and press return to search.
అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ నిర్మాణానికి హైకోర్టు అనుమతి
By: Tupaki Desk | 23 Jun 2022 4:30 AM GMTతెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఏపీ హైకోర్టు ఊరట కల్పించింది. రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమంచి అయ్యన్నపాత్రుడు తన ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ నర్సీపట్నం మున్సిపల్ అధికారులు ఆయన ఇంటి గోడను కొద్ది రోజుల క్రితం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట తమ ఇంటికొచ్చి నానా బీభత్సం సృష్టించారని అయ్యన్నపాత్రుడి భార్య, కుమారులు ఆరోపించిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం బీసీలను బతకనీయడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు చింతకాయలకు మద్దతుగా టీడీపీ నేతలు చలో నర్సీపట్నం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో తమ ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు చింతకాయల విజయ్, చింతకాయల రాజేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేశారన్నారు. తహసీల్దార్, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే అయ్యన్నపాత్రుడు తన ఇంటి గోడను నిర్మించారన్నారు.
జగన్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని చెప్పారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఇంటి గోడ నిర్మించుకునేందుకు చింతకాయల అయ్యన్నపాత్రుడికి అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.
హైకోర్టు తీర్పుతో జగన్ ప్రభుత్వానికి తీవ్ర షాక్ తగిలింది. అయ్యన్న పాత్రుడు పంటకాలువ ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారంటూ.. జూన్ 19న అర్ధరాత్రి జేసీబీలతో ఇంటి గోడను మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. జూన్ రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్నపాత్రుడి కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయ్యన్నపాత్రుడి ఇంటి చుట్టుపక్కల అర్ధరాత్రి నుంచే.. విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. అయ్యన్నపాత్రుడి వద్ద పనిచేసేవారు, నిత్యావసరాలు తీసుకొచ్చే వారిని కూడా.. పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు.
అలాగే.. అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లే రెండు మార్గాలను మూసివేశారు. మీడియాను ఆ పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు. నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలో పోలీసుల బలగాలు మోహరించారు. అన్ని నియమాలకు లోబడే ఇంటి నిర్మాణం చేశామని.. ఇంటి గోడ ధ్వంసం చేయడంపై ప్రశ్నించిన అయ్యన్నపాత్రుడి రెండో కుమారుడు రాజేష్‌ను పోలీసులు చుట్టుముట్టారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పోలీసులు, అధికారులతో..
అయ్యన్న కుటుంబం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. జూన్ రెండో తేదీతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి.. వెంటనే తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో వారికి ఊరట లభించింది.