Begin typing your search above and press return to search.
6 లక్షలు కడితేనే శవం ఇస్తాం ..భర్త శవం కోసం కోర్టుకు ఎక్కిన భార్య !
By: Tupaki Desk | 25 July 2020 11:30 AM GMTహైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో ఒకరు కరోనా తో చికిత్స పొందూతూ మృతి చెందారు. అప్పటి వరకు చికిత్సకోసం రూ.1. 50 లక్షలను బాధితుడికు టుంబీకులు చెల్లించారు. 7.50 లక్షల బిల్లు అయిందని, మరో 6 లక్షలు ఇస్తేనే మృతదేహన్ని ఇస్తామని , లేకపోతే డెడ్ బాడీని ఇవ్వమని ఆసుపత్రి యాజమాన్యం ఆ కుటుంబానికి తెలిపింది. దీనితో ఏమిచేయాలో తెలియక పరిస్థితిలో ఉన్న అతడి భార్య, కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండానే, పోలీసుల సమక్షంలో డెడ్ బాడీని అప్పచెప్పింది. అలాగే , ఆ 6 లక్షల బిల్లును మాఫి చేసింది.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. కరోనా రోగుల పట్ల..మానవత్వంతో స్పందించాలని ప్రభుత్వం సూచిస్తున్నా..కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నాయి. లక్షలకు లక్షలకు బిల్లులు వేస్తున్నాయి. కరోనా కారణం చెప్తూ కార్పొరేట్ ఆసుపత్రులు బాధితుల వద్ద కాసుల దోపిడికి పాల్పడుతున్నాయి. వందల రూపాయల మందులు ఇస్తూ లక్షల్లో దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరలు కాకుండా..లక్షలు బిల్లులు వేస్తున్నాయి. హైదరాబాద్ , మూసాపేటకు చెందిన మోహన్ బాబు, కరోనాతో 2020, జులై 14వ తేదీన కాంటినెంటల్ హాస్పిటల్, నానక్ రామ్ గూడా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. చికిత్స ప్రారంభించకముందే లక్షన్నర రూపాయలను డిపాజిట్ చేసుకుంది ఆసుపత్రి యాజమాన్యం. చికిత్స పొందుతూ మోహన్ బాబు చనిపోయాడు.రూ. 6 లక్షల రూపాయలను ఇస్తే గాని డెడ్ బాడీని ఇవ్వమని తేల్చి చెప్పడం తో మృతుడి భార్య కోర్టు మెట్లు ఎక్కింది. దీనిపై స్పందించిన కోర్టు వెంటనే ఆమెకి తగిన న్యాయం చేసింది. అలాగే ఈ ఘటన పై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.