Begin typing your search above and press return to search.
ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం...పద్ధతి మార్చుకోవాలంటూ హితబోధ !
By: Tupaki Desk | 6 May 2021 11:30 AM GMTఏపీలో రోజురోజుకి కరోనా వైరస్ విజృంభణ పెరిగిపోతున్న తరుణంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అఫిడవిట్ లో దాఖలు చేసిన దానికి.. క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న విధానావకు పొంతనలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని గత అఫిడవిట్లో చెప్పినప్పటికీ , వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు దొరకడం లేదని నోడల్ అధికారులే చెప్పారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పద్ధతి మార్చుకోకుంటే సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కరోనాకు సరైన చికిత్సలు అందడం లేదంటూ సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్ఏ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టు వివరించారు. అదే సమయంలో వాస్తవ పరిస్థితిని అమికస్ క్యూరీ కోర్టుకు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స అందించేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి 104, 1902 ద్వారా అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తోంది. అయితే , ఆక్సిజన్ లభ్యత విషయంలో మాత్రం కాస్త గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. పలుజిల్లాల్లో కొవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందినట్లు వస్తున్నవార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. నోడల్ అధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, ఎక్కువ పరీక్షలు చేసేలా సౌకర్యాలు కూడా పెంచాలని కోరింది. ఇక వ్యాక్సినేషన్‌పై కూడా హైకోర్టు ఆరా తీసింది. 45 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా 22,204 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 12,06,232 చేరింది. వీరిలో ఇప్పటివరకు 10,27,720 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,70,588కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8,374 కి చేరింది.