Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారు హడావుడి నిర్ణయంపై హైకోర్టు ఆగ్రహం
By: Tupaki Desk | 24 Jun 2021 5:30 AM GMTకొన్ని సందర్భాల్లో నత్త కంటే నెమ్మదిగా.. మరికొన్ని సందర్భాల్లో రెప్పపాటుగా వరుస పెట్టి నిర్ణయాలు తీసుకునే విచిత్రమైన తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఫాంహౌస్ కు వెళితే రోజుల తరబడి కనిపించని ముఖ్యమంత్రి.. అందుకు భిన్నంగా తనకు మూడో వస్తే.. తాను మాత్రమే కాదు యావత్ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించటం అలవాటే. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేయటమే కాదు.. పనిలో పనిగా మూతబడిన స్కూళ్లను జులై ఒకటో తేదీ నుంచి తెరిచేందుకు వీలుగా జీవో జారీ చేశారు.
దీనిపై తాజాగా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించకుండా జూలై ఒకటో తేదీ నుంచి స్కూళ్లు తెరుస్తూ నిర్ణయం తీసుకోవటాన్ని తెలంగాణ హైకోర్టు తప్పు పట్టింది. ‘‘ఇంత అనాలోచిత నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు? పెద్దలే కరోనా నిబంధనల్ని పాటించట్లేదు. పిల్లలు నిబంధనలు పాటిస్తారన్న నమ్మకం ఉందా? వారికి ప్రమాదం కలగకుండా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని వ్యాఖ్యానించింది.
జీవో జారీ చేసినప్పటికీ పిల్లలు స్కూల్ కే వెళ్లాలన్న తప్పనిసరి ఏమీ లేదని చెబుతున్నారు. తల్లిదండ్రులు అంగీకరిస్తేనే బడులకు హాజరు కావొచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. పిల్లలకు తమకు ఇష్టం వచ్చినట్లుగా అయితే ఆఫ్ లైన్ లేదంటే ఆన్ లైన్ లో అయినా క్లాసులు వినొచ్చని చెబుతున్నారు. మూడో వేవ్ ముప్పుపై ఆందోళన నెలకొన్న వేళలో రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఏమిటంటూ విస్మయాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టు తాజాగా రియాక్టు అయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.