Begin typing your search above and press return to search.
ఇంకా ఎంతమంది చనిపోవాలి.. తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం
By: Tupaki Desk | 22 Sep 2021 12:30 PM GMTతెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా విషయంలో నిర్లక్ష్యంపై హైకోర్టు మండిపడింది. తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా ఔషధాలను అత్యవసర జాబితాలో చేర్చడంలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమంది మరణించాక చేరుస్తారని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. అక్టోబర్ 31లోగా అత్యవసర జాబితాలో చేర్చాలని కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక తెలంగాణలో రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విద్యాసంస్థల్లోనూ సిబ్బందికి రెండు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళికలో జాప్యంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రెండు సార్లు ఆదేశించినప్పటికీ ఎందుకు సమర్పించలేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా.శ్రీనివాస్ ను ప్రశ్నించింది. కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డీహెచ్ కోర్టుకు వివరించారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వ పాలసీలే అమలు చేస్తారా? కోర్టు ఆదేశాలు అమలు చేయరా? అని హైకోర్టు ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైకోర్టు హెచ్చరించింది. ఈనెల 30లోగా సీసీజీఆర్ఏ రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇక తెలంగాణలో కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రెండు నెలల్లో పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.20 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశామని వివరించారు. రాష్ట్రంలో 60శాతం మందికి మొదటి డోస్ పూర్తయ్యిందని.. 38శాతం మందికి రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ వివరించారు.