Begin typing your search above and press return to search.
రాయలసీమలో హైకోర్టు బెంచ్ కు ముందడుగు
By: Tupaki Desk | 31 Jan 2019 5:59 AM GMTరాష్ట్ర విభజన తర్వాత ఒక్కో కేంద్ర కార్యాలయం అమరావతికి తరలివస్తున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత ఈ ఏడాది జనవరి 1 నుంచి అమరావతిలో హైకోర్టు తాత్కాలికంగా ఏర్పాటైంది. ఫిబ్రవరి 3న భారత ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కనీసం బెంచ్ ను అయినా రాయలసీమలో ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిటీషన్ ను విచారణకు తీసుకున్న న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది.
మొదట హైకోర్టు కర్నూలులో ఉండేది. ఆ తర్వాత తెలంగాణ - ఆంధ్రా కలిసిపోవడంతో.. పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. అయితే శ్రీభాగ్ ఒడంబడిక మేరకు హైకోర్టు బెంచిని సీమలో ఏర్పాటు చేయాలని సీమ వాసులు ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ - ఆంధ్ర విభజన అయ్యింది. దీంతో ఇప్పుడైనా హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేయాలని.. అక్కడి ప్రజలు, మేధావులు కోరారు. కానీ ఏపీ ప్రభుత్వం హైకోర్టుని అమరావతిలోనే ఏర్పాటు చేసింది. దీంతో.. హైకోర్టు బెంచి అయినా సీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
జి.నారాయణ స్వామి అనే న్యాయవాది 2017లో ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ వేశారు. అమరావతిలోనే హైకోర్టు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి.. బెంచిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని ఆయన తన పిటీషన్ లో కోరారు. అదీగాక.. బెంచి ఏర్పాటు చేయడం హైకోర్టు పరిథిలోనే ఉంటుందని.. గతంలో ఔరాంగాబాద్ బెంచ్ ని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో సుప్రీం కూడా ఎలాంటి అభ్యంతరాలను చెప్పలేదని వాదించారు. దీంతో ఏకీభవించిన న్యాయస్థానం.. సీమలో బెంచి ఏర్పాటుపై అభిప్రాయాలను చెప్పాలని ఆదేశించింది. ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు అవ్వడం ఖాయం.