Begin typing your search above and press return to search.
లా విద్యార్థిని రేప్ కేసులో హైకోర్టు తీర్పు సన్సేషన్
By: Tupaki Desk | 22 Sep 2017 8:59 AM GMTదేశ చరిత్రలో తొలిసారి వాట్సాప్ సందేశాల్ని సాక్ష్యంగా పరిగణించి కోర్టు తీర్పు ఇచ్చిన వైనం ఒకటైతే.. రేప్ కేసు తీర్పు సందర్భంగా బాధితురాలిపై న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హర్యానాలో తీవ్ర సంచలనం రేపిన లా విద్యార్థిని అత్యాచార ఉదంతంలో చండీగఢ్ హైకోర్టు తీర్పు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి. కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా అత్యాచార బాధితురాలిపై న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
తనపై రెండేళ్ల పాటు తన సీనియర్లు అత్యాచారం చేశారంటూ సోనేపట్ లో ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీకి చెందిన బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన నగ్న చిత్రాలను సేకరించి.. వాటిని అందరితో పంచుకోవటంతో పాటు యాపిల్ ఐ క్లౌడ్ లో దాచారని.. సెక్స్ టాయ్స్ కొనిచ్చి వాటిని వాడుతూ.. స్కైప్ లో లైవ్ వీడియోలో చూపించాలని బెదిరించినట్లుగా ఆమె పేర్కొంది.
బాధితురాలు.. ఆమెను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపించిన వారి మధ్య సాగిన వాట్సాప్ ఛాటింగ్ ను విచారణలో భాగంగా తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ లో మొదలైన ఈ కేసు విచారణ ఈ ఏడాది జూన్ లో తీర్పు వెలువడింది. వాట్సాప్ ద్వారా సాగిన సంభాషణను సాక్ష్యంగా పరిగణించిన కోర్టు ఇద్దరికి 20 ఏళ్ల పాటు శిక్ష విధించగా.. మరో విద్యార్థికి ఏడేళ్లు జైలుశిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితులు చండీగఢ్ కోర్టును ఆశ్రయించారు. మరోసారి కేసును విచారించిన హైకోర్టు బాధితురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాధితురాలు కాస్త కూడా పరిణితి లేకుండా వ్యవహరించిందని.. యువకులతో మరీ సానిహిత్యంగా మెలిగిందని.. పైగా లైంగికపరమైన కోరికలతో స్నేహితులతో అసభ్యమైన ఛాటింగ్ చేసినట్లుగా పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలను ఆమె ఒప్పుకుందని.. వైద్యులు సైతం సదరు యువతి మానసిక పరిస్థితి సరిగా లేదన్న విషయాన్ని తేల్చారని అలాంటప్పుడు నిందితులకు మరీ అంత కఠినమైన శిక్ష విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
విద్యార్థుల భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని కింది కోర్టు తీర్పును కొట్టేసింది. అత్యాచార బాధితురాలి విషయంలో ఈ తరహా తీర్పు సంచలనంగా మారింది.