Begin typing your search above and press return to search.
డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు డెడ్ లైన్
By: Tupaki Desk | 18 Nov 2020 4:15 PM GMTవిశాఖపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసుపై హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ సీల్డ్ కవర్ లో రెండవ రిపోర్టును అందజేసింది. ఫైనల్ రిపోర్టు సమర్పించేందుకు రెండు వారాల గడువు కోరింది. అయితే హైకోర్టు నిరాకరించింది.
డాక్టర్ సుధాకర్ కేసులో పూర్తి రిపోర్ట్ ఈనెల 26న సమర్పించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు సున్నితమైన అంశం కాబట్టి ఓపెన్ కోర్టులో బహిర్గతం చేయలేమని సీబీఐ తెలిపింది. దీంతో పీపీ సీల్డ్ కవర్ ను తమ ముందు ఉంచాలన్న ధర్మాసనం.. మరోసారి బధవారం విచారణ జరిపింది.
కరోనా సమయంలో ఆస్పత్రిలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవని నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ ఆరోపించడం కలకలం రేపింది. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయడం.. విపక్షాలు రాద్ధాంతం చేయడం.. ఆ తర్వాత రోడ్లపై పోలీసులతో సుధాకర్ గొడవ పెట్టుకోవడంతో దుమారం రేగింది. ఆయన మానసిక స్థితి దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. డాక్టర్ సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించగా దర్యాప్తు జరుగుతోంది.