Begin typing your search above and press return to search.

గ్రేట‌ర్ పై స‌ర్కారు మాట‌కు హైకోర్టు ఓకే!

By:  Tupaki Desk   |   2 Nov 2015 7:56 AM GMT
గ్రేట‌ర్ పై స‌ర్కారు మాట‌కు హైకోర్టు ఓకే!
X
నెలల కొద్దీ సా..గుతున్న గ్రేటర్ ఎన్నికల వ్యవహారం తాజాగా మరోసారి హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికల్ని ఎప్పటిలోపు నిర్వహిస్తారన్న ప్రశ్నకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సమాధానం ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 31 లోపు గ్రేటర్ ఎన్నికల వ్యవహారాన్ని పూర్తి చేయనున్నట్లు వెల్లడించింది. ఈ డిసెంబరు 15 నాటికి గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే.. వార్డుల పునర్విభజన.. ఓటర్ల జాబితా..తదితర అంశాల కారణంగా గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు జనవరి 31 వరకు తమకు సమయం ఇవ్వాలని అధికారులు కోరారు. అయితే.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయిన నేపథ్యంలో డిసెంబరు 15 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అధికారుల వాదన విషయంలో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి.. కోర్టు చెప్పిన రీతిలో డిసెంబరు 15 నాటికి గ్రేటర్ ఎన్నికలు పూర్తి చేస్తారా? లేక.. ప్రభుత్వం ప్రకటించిన విధంగా జనవరి 31 లోపు పూర్తి చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
తాజాగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల మీద హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ మీద గ్రేట‌ర్ క‌మిష‌న‌ర్ అపిడ‌విట్ దాఖ‌లు చేసి.. జ‌న‌వ‌రి 31లోపు పూర్తి చేస్తామ‌ని వాంగూల్మం ఇచ్చారు. దీన్ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ న‌మోదు చేశారు. ఈ నేప‌థ్యంలో గ్రేట‌ర్ ఎన్నిక‌ల్ని జ‌న‌వ‌రి 31లోపు పూర్తి చేయాల‌ని ఆదేశించింది. తాజా ప‌రిణామంతో.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల మీద ఉన్న సందిగ్థ‌త తొలిగిపోయి.. కొత్త సంవ‌త్స‌రంలో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని ప‌క్కాగా తేలిన‌ట్లుగా చెప్పొచ్చు.