Begin typing your search above and press return to search.
షరతులున్నాయి: కాల్ డేటా ఇవ్వాల్సిందే కానీ..!
By: Tupaki Desk | 30 July 2015 3:50 PM GMTఏపీకి చెందిన ముఖ్యనేతల ఫోన్లు ట్యాపింగ్ కేసుకు సంబంధించి టెలికం కంపెనీలు తమ వద్దనున్న కాల్‌డేటాను ఇవ్వాలంటూ విజయవాడ కోర్టు ఆదేశించటం.. దానికి సుప్రీంకోర్టు ఓకే చెప్పటం తెలిసిందే. అయితే.. దీనిపై తెలంగాణసర్కారు హైకోర్టుకు వెళ్లి.. కాల్‌డేటా ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోవటం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలానీ తెలంగాణ సర్కారు తరఫున వాదిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఫోన్లను ట్యాప్ చేసిందని చెబుతూ.. అందుకు దారి తీసిన కారణాల్ని వివరించటం తెలిసిందే. దీనిపై వాదనల్ని విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేయటం తెలిసిందే.
విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా టెలికం కంపెనీలు తమ వద్దనున్నకాల్‌డేటాను ఇవ్వాలని.. కాకుంటే ఆ సమాచారాన్ని సీల్డ్ కవర్ లో ప్రత్యేక మెసెంజర్ ద్వారా హైకోర్టుకు పంపాలని పేర్కొంది. ఇక.. తెలంగాణ ప్రభుత్వ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది. ఎట్టి పరిస్థితుల్లో సర్వీసు ప్రొవైడర్ల వద్దనున్న కాల్ డేటా ఇచ్చేందుకు సుతారమూ ఇష్టపడని తెలంగాణ సర్కారుకు.. తాజా హైకోర్టు ఆదేశం కాసింత ఇబ్బంది కలిగించేదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.