Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు జగన్ గట్టి షాకిచ్చాడు
By: Tupaki Desk | 29 Aug 2016 3:21 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరో ఘట్టి షాక్ తగిలింది. కేసీఆర్ లైట్ తీస్కుంటున్న వైఎస్ జగన్ రూపంలో ఈ ఝలక్ తగిలింది. కొత్త జిల్లా ఏర్పాటుపై సర్కార్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఈ రోజు ధర్మాసనం ముందుకు రాగా కోర్టు ఘాటు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే అఖిల పక్ష సమావేశాలకు తెలంగాణ వైసీపీని ఆహ్వానించాలని హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ తరఫున వాధించిన న్యాయవాది తమ అభ్యంతరాలు వినిపిస్తూ ముగ్గురు ఎమ్మెల్యేలను - ఒక ఎంపీని గెలుచుకున్న తమ పార్టీ తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా ఉందని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యే - ఎంపీలు పార్టీ మారిన అంశం నిజమే అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించామని గుర్తుచేశారు. ఇప్పటికీ తెలంగాణలో బలమైన పార్టీగా వైసీపీ ఉన్నప్పటికీ కొత్త జిల్లాల విభజనలో అసలేమాత్రం లెక్కలోకి తీసుకోకుండా ఆహ్వానం కూడా పంపలేదని వైసీపీ లాయర్ వాదించారు. అందుకే తమకు సరైన గౌరవం దక్కే విధంగా నిర్ణయం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వైసీపీ న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తెలగాణ సర్కారుకు తగు సూచనలు జారీచేసింది. జిల్లా పునర్విభజనలో వైసీపీని పరిగణనలోకి తీసుకొని అఖిలపక్ష సమావేవాలకు ఆహ్వానం అందించాలని సూచించింది.