Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్యేకు హైకోర్టు షాక్...ఎన్నిక చెల్లదని తీర్పు
By: Tupaki Desk | 27 Nov 2018 6:39 PM GMTతెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగలింది. అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈయన పై వైసీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ మోపురగుండు తిప్పేస్వామి విజయం సాధించినట్టు న్యాయస్థానం ప్రకటించింది. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారమిచ్చారనే ఆరోపణల పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తన పై ఉన్న నాలుగు క్రిమినల్ కేసుల గురించిన వివరాలు, అలాగే భార్య ప్రభుత్వ ఉద్యోగనే విషయాన్ని ఈరన్న అఫిడవిట్‌లో తెలపకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని వైసీపీ నేత తిప్పేస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కర్నాటకలో తన పై నమోదైన క్రిమినల్ కేసులను అఫిడవిట్‌లో వెల్లడించకుండా ఈరన్న దాచారని తిప్పేస్వామి ఆరోపించారు. అంతేకాదు తన భార్య ప్రభుత్వ ఉద్యోగి అనే విషయాన్ని కూడా ఈరన్న అఫిడవిట్‌లో తెలపలేదని తిప్పేస్వామి తన పిటిషన్‌లో ఆరోపించారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన కోర్టు..అనేక ఆధారాలు సేకరించిన తర్వాత ఈరన్న ఎన్నిక చెల్లదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇదివరకు పోటీలో ఉన్న తిప్పేస్వామి తదుపరి ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని కోర్టు సూచనలు చేసింది.