Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ కు హైకోర్టులో ఊరట?

By:  Tupaki Desk   |   16 Dec 2019 10:46 AM GMT
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ కు హైకోర్టులో ఊరట?
X
వేములవాడ టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోం శాఖ రద్దుచేసిన విషయం తెలిసిందే. హోం శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎమ్మెల్యే చెన్నమనేని హైకోర్టు ఆశ్రయించగా నవంబరు 22న మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. నాలుగు వారాల పాటు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను నిలిపివేయాలని చెప్పింది. తాజాగా మరోసారి హైకోర్టు స్టే పొడిగింది. దీంతో చెన్నమనేనికి మరోసారి ఊరట లభించింది. ఎనిమిది వారాల పాటు చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చెన్నమనేని పౌరసత్వం కేసు విచారణ సందర్భంగా రమేష్‌ కు జర్మనీ - భారతీయ పౌరసత్వం ఉందని పిటిషనర్ తెలుపగా ..ఈ నేపథ్యంలో రమేష్‌ బాబు - జర్మనీ పౌరసత్వాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం విచారణ చేపట్టిన కోర్టు రమేష్‌ బాబు రెండు పౌరసత్వాలకు సంబంధించిన ఆధారాలు చూపించాలని - పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

రమేష్‌ బాబు పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్‌ నేత ఆది శ్రీనివాస్‌ గతంలో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా చెన్నమనేని రమేశ్ భారతీయ పౌరసత్వం పొందాడని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం శాఖ అప్పుడు చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేసింది.