Begin typing your search above and press return to search.

అమ్మ ఆస్తులపై పిటీషన్ వేసిన వ్యక్తికి షాక్

By:  Tupaki Desk   |   20 Dec 2016 7:42 AM GMT
అమ్మ ఆస్తులపై పిటీషన్ వేసిన వ్యక్తికి షాక్
X
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటీషన్ ధాఖలు చేసిన పిటీషనర్ కు షాక్ తగిలింది. అమ్మ మరణించిన నేపథ్యంలో.. హైదరాబాద్ లో ఉన్న ఆమె ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుతూ పిటీషనర్ ఒకరు పిటీషన్ జారీ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. పిటీషనర్ పై తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేసింది.

పిటీషన్ పై విచారణ సమయంలో.. జయలలితకు వారసులు ఎవరూ లేరన్న వాదనను పిటీషనర్ వాదించటం.. ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ లేరా? అన్న ప్రశ్నకు తమకు సమాచారం తెలీదన్న పిటీషనర్ వైఖరిపై హైకోర్టు తీవ్రంగా మందలించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. జయలలితకు సోదరుడు ఉండటం.. ఆయనకు ఒక కుమర్తె.. కుమారుడు ఉన్న నేపథ్యంలో ఆస్తుల్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనవసరంగా విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తికి రూ.లక్ష జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పిటీషన్ల కారణంగా కోర్టు సమయం వృధా కావటమే కాదు.. అనవసరమైన గందరగోళానికి కారణమవుతుందన్న వ్యాఖ్యను చేసింది. తాజా తీర్పుతో.. సంచలనాల కోసం పిటీషన్లు దాఖలు చేసే వారి జోరుకు బ్రేకులు పడటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/