Begin typing your search above and press return to search.
సర్కార్ బడిలో ఎమ్మెల్యే పిల్లలుఎందుకు వెళ్లరు?
By: Tupaki Desk | 26 Jan 2019 7:57 AM GMTసంపన్న రాష్ట్రం.. కనురెప్ప మాటున కూడా కరెంటు పోదు.. మనకేం తక్కువ? ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం గొప్పతనం గురించి చెప్పే గొప్పల గురించి కథలు.. కథలుగా చెప్పుకోవటం కనిపిస్తుంటుంది. నిజంగానే తెలంగాణలో అలాంటి పరిస్థితి ఉందా? అన్నది పక్కన పెడితే.. తాజాగా హైకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యల్ని విన్నారా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రజాప్రతినిధులు.. పెద్ద పెద్ద ఆఫీసర్లు తమ పిల్లల్ని ఎందుకు పంపటం లేదన్న ప్రశ్నను సంధించిన హైకోర్టు సూటిగా ప్రశ్నించటమేకాదు.. ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపటంలో తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగేలా సర్కారు తీసుకున్న చర్యల్ని తమకు చెప్పాలని కోర్టు కోరింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోవడాన్ని ప్రశ్నిస్తూ ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకటరెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇంతకీ కోర్టు ఏమన్నదంటే..
+ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు?
+ కేరళలో ఎమ్మెల్యేలు, ఐఏఎ్‌సల పిల్లలు కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు వెళతారు. ఇలాంటి చర్యల వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుంది.
+ అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు మధ్య అనుసంధానం ఉండాలి., ఇక్కడి నుంచే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
+ ప్రభుత్వ పాఠశాలలు పిల్లలను ఎందుకు ఆకర్షించడం లేదు? సరైన ఫలితాలు ఎందుకు రావడం లేదు? పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించాలి.
+ మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
+ బడిలోనే సరైన చదువు చెప్పాలి. లేదంటే బతుకంతా చదువుకోవాల్సి ఉంటుంది.
+ మన ప్రధాని ఎవరు అని ప్రశ్నిస్తే చాలామంది పిల్లలు సరైన జవాబు చెప్పలేక పోతున్నారు., ఏమీ తెలియకుండానే వ్యవస్థ నడిచి పోతుంది. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఏం చేస్తోంది?