Begin typing your search above and press return to search.
డిప్యూటీ సీఎం కొడుకు ఇరుక్కుపోయినట్లే
By: Tupaki Desk | 8 Feb 2017 8:57 AM GMTఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖా మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మరో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. కేఈ కుమారుడు శ్యాంబాబుపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. హంద్రీ నీవాలో ఇసుక అక్రమ తవ్వకాలలో తప్పు చేసినట్టుగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఇసుక అక్రమ తవ్వకాలలో కోసనపల్లె - చెరుకులపాడు గ్రామాలకు చెందిన ప్రజలిచ్చిన వినతిపత్రాల ఆధారంగా శ్యాంబాబుపై విచారణ చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, న్యాయమూర్తి షమీమ్ అక్తర్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ప్రజల ఫిర్యాదుల్లో నిజానిజాలు తేల్చాలని, నివేదిక తమకు సమర్పించాలని ఏపీ భూగర్భ గనుల శాఖను బెంచ్ ఆదేశించింది.
యథేచ్ఛగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, గ్రామాల్లో మంచినీటి సమస్య జటిలమవుతోందని పేర్కొంటూ కోడుమూరు, కృష్ణగిరి మండలాల్లోని మన్నేకుంట, ఎస్.హెచ్. ఎర్రగుడి గ్రామాలకు చెందిన ఎ.బజారీ మరో 11 మంది దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. శ్యాంబాబుపై ప్రజలు చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిందీ లేనిదీ తెలియజేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. విచారణ చేసి తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకోవాలని, లేదని తేలితే ఆ ఫిర్యాదును పక్కన పెట్టవచ్చునని, అయితే ముందే ఆ ఫిర్యాదును పట్టించుకోకపోతే ఎలాగని బెంచ్ నిలదీసింది. అధికారంలో ఉన్న వారిపై వచ్చిన ఫిర్యాదులను గాలికి వదిలేస్తే ఎలాగని ప్రశ్నించింది. అధికారులు కేసుతో సంబంధం లేని తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల గురించి వివరించడంపై హైకోర్టు తప్పుపట్టింది. డ్రైవర్లు - క్లీనర్లపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం కాదని, వాహన యజమానులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని - జిల్లా కలెక్టర్ - ఎస్పీలను హైకోర్టు నిలదీసింది. వచ్చే వారం జరిగే విచారణ నాటికి వాటితోపాటు ఎంతమందిని అరెస్ట్ చేశారో, ఎంతమందిపై కేసులు నమోదు చేశారో, ఎంత సొమ్ము రికవరీ చేశారో కూడా తెలియజేయాలని వారిని బెంచ్ ఆదేశించింది. గ్రామ ప్రజలు శ్యాంబాబుపై సమర్పించిన వినతిపత్రంపై విచారణ చేసి, తప్పు చేసినట్టుగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/