Begin typing your search above and press return to search.
అగ్రిగోల్డ్ పై ఫైర్ అయిన హైకోర్
By: Tupaki Desk | 23 Jun 2016 4:36 AM GMTలక్షలాది మంది డిపాజిటర్లను నిలువునా ముంచి.. ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన అగ్రిగోల్డ్ సంస్థ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా మరోసారి ఈ సంస్థ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. బుధవారం అగ్రిగోల్డ్ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ సంస్థపై ఫైర్ అయ్యింది. వేలం ఖర్చుల కోసం రూ.25 లక్షల మొత్తాన్ని ధరావతు చేయాలన్న ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదన్న ధర్మాసనం ప్రశ్నకు అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమ క్లయింట్లు జైల్లో ఉన్నారన్నారు.
దీనికి మండిపడ్డ ధర్మాసనం.. ‘‘మనుషులు జైల్లో ఉన్నా డబ్బులు బయటే ఉంటుంది కదా? మీ క్లయింట్లు తెలివైన వారు. జైల్లో ఉండీ న్యాయవాదిని ఏర్పాటు చేసుకోగల సమర్థులు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంపెనీ వాటాలను డిపాజిటర్లకు ఇవ్వాలంటూ చేసిన కొత్త ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. ఇలాంటి మాటలన్నీ కేసును జాప్యం చేయటానికే తప్ప మరొకటి కాదన్న వ్యాఖ్య చేసింది.
ఇప్పటికే విచారణ ప్రక్రియ ఆలస్యమైందన్న కోర్టు.. 17 విభాగాల్లోని ఆస్తులు అమ్మితే రూ.500 కోట్లు వస్తాయని యాజమాన్యం చెప్పిందని.. రెండు విడతల్లో వేసిన వేలంలో వచ్చిన మొత్తం చాలా స్వల్పమని గుర్తుచేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం చెప్పిన 260 ఆస్తుల్లో ఎక్కువ భాగం తాకట్లలో ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. విశాఖపట్నం.. విజయవాడ.. మైసూరులోని ఆస్తుల వేలం ద్వారా రూ.3500 కోట్ల మొత్తం వస్తుందని చెప్పి.. ఇప్పుడు వేలానికి సహకరించటంలేదని తప్పు పట్టింది.
హైకోర్టు ఆగ్రహాన్ని చూసిన అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తమకు గడువు ఇస్తే రూ.25లక్షల డిపాజిట్ చేస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణను సీబీఐ చేత చేయించేందుకు తాము సిద్ధమేనని ఏపీ సర్కారు వెల్లడించింది. ఇదే అంశంపై తెలంగాణ సర్కారు వైఖరి స్పష్టం చేయాలని కోరింది. తెలంగాణ.. కర్ణాటక ప్రభుత్వాలు సీబీఐ విచారణకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాతపూర్వకంగా తెలియజేసిన పక్షంలో సీబీఐ విచారణకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.