Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ వేసింది

By:  Tupaki Desk   |   16 Jun 2016 9:51 AM GMT
కేసీఆర్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయ వేసింది
X
రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగులని అధిక్యతను ప్రదర్శిస్తారు. వ్యూహపరంగానూ ఆయన్ను వేలెత్తి చూపే వారు కనిపించరు. అదేం చిత్రమో కానీ.. విధానపరమైన నిర్ణయాలు.. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు తడబడుతూ తప్పటడుగులు వేయటం కనిపిస్తుంది. గడిచిన రెండేళ్ల వ్యవధిలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ని హైకోర్టు తప్పు పట్టటం తెలిసిందే. తాజాగా అలాంటిదే మరొకటి చోటు చేసుకుంది.

పాలమూరు.. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ కోసం జారీ చేసిన జీవో నెంబరు 123ను ప్రయోగించటం సరికాదంటూ హైకోర్టు ధర్మాసనం తేల్చింది. అంతేకాదు.. మెజార్టీ రైతులు డిమాండ్ చేసే ధరల్ని చెల్లించే భూములు సేకరించాలంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. ఇలాంటి ఆదేశాల్ని ఊహించని తెలంగాణ సర్కారు.. హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలతో ఇరుకున పడిందన్న మాట వినిపిస్తోంది.