Begin typing your search above and press return to search.

ఇంట‌ర్ ఎపిసోడ్ పై కేసీఆర్ స‌ర్కారును క‌డిగేసిన హైకోర్టు

By:  Tupaki Desk   |   24 April 2019 4:26 AM GMT
ఇంట‌ర్ ఎపిసోడ్ పై కేసీఆర్ స‌ర్కారును క‌డిగేసిన హైకోర్టు
X
తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఇంట‌ర్ బోర్డు వైఫ‌ల్యంపై తాజాగా హైకోర్టు స్పందించిన తీరు సంచ‌ల‌నంగా మారింది. ఇంట‌ర్ బోర్డు వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టిన కోర్టు.. ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. 9 ల‌క్ష‌ల మంది పేప‌ర్ల‌ను నెల‌లో వాల్యూయేష‌న్ చేసిన ప్ర‌భుత్వ యంత్రాంగానికి 3 ల‌క్ష‌ల మంది విద్యార్థుల పేప‌ర్ల‌ను రీవాల్యువేష‌న్ చేయ‌టానికి రెండు నెల‌లు అవ‌స‌ర‌మా? అంటూ సూటిగా ప్ర‌శ్నించింది.

ఇంట‌ర్ ఫ‌లితాల వెల్ల‌డిలో ఫెయిల్ అయిన ఇంట‌ర్ బోర్డు.. తాజాగా హైకోర్టులో వినిపించిన‌ వాద‌న‌పైనా రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. గ‌ణాంకాలు త‌న‌కొద్ద‌ని.. ప‌ని మాత్ర‌మే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల్ని ప్ర‌స్తావిస్తూ.. వివిధ ప్ర‌భుత్వ విభాగాల‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను చెబుతూ.. వాటిని వారెలా ప‌రిష్క‌రిస్తారో చెప్పుకొచ్చింది.

ఇంట‌ర్ బోర్డును క‌డిగిపారేసేలా ఫైర్ అయిన హైకోర్టు వ్యాఖ్య‌లు ఇప్పుడు కీల‌క‌లంగా మారాయి. ఇంట‌ర్ మార్కుల ఎపిసోడ్ మీద హైకోర్టు చేసిన వ్యాఖ్య‌ల్లో ఆస‌క్తిక‌ర‌మైన‌వి చూస్తే..

+ చేయాలన్న చిత్తశుద్ధి లేదు...చేయలేమన్న భ్రమలో ఉన్నారు...అవసరమైతే మరింత మంది సిబ్బందిని వినియోగించండి... సునామీ వస్తే అడ్డుకోలేమని...ఇది తమ బాధ్యత కాదని తప్పుకుంటారా? బాధ్యత తీసుకోరా?

+ ఇది యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశం. వారు మన పిల్లలు. సమస్య ఉందంటున్నారు. పరిష్కరిస్తామని భరోసా ఇవ్వండి.

+ అమెరికాలో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ పై దాడి జరిగినపుడు ఎగసిన మంటలను ఆర్పడం తనవల్ల కాదని 58 ఏళ్ల అగ్నిమాపక శాఖాధికారి చెప్పలేదు. స్వయంగా తానే ముందుండి ప్రాణాలను ఫణంగా పెట్టి ఆదర్శంగా నిలిచారు. అదేరీతిలో మీరూ మన పిల్లల భవిష్యత్తుపై స్పందించండి. దీనికి పరిమితులు పెట్టుకోవద్దు. మనసుంటే మార్గముంటుంది.

+ 9 లక్షల మంది పేపర్లను నెలలో వాల్యుయేషన్‌ చేసిన యంత్రాంగం 3 లక్షల మందివి రీవాల్యుయేష‌న్ చేసేందుకు 2 నెల‌లు అవ‌స‌ర‌మా? 10 రోజుల్లో చేయ‌టం సాధ్యం కాదాయంత్రాంగం లేదన్న కారణాలు చెప్పొద్దు. సమస్య ఉందని మీరే చెప్పారు. మూడు లక్షల మందిలో రెండు లక్షల మంది ఉత్తీర్ణులైతే మన విద్యావ్యవస్థ ఆదర్శంగా ఉన్నట్లేగా. ప్రభుత్వం ఎందుకు సిగ్గుపడాలి. ప్రతి ఏటా 3 లక్షల మంది తప్పుతున్నారంటూ గణాంకాలు చెప్పొద్దు. పరిష్కారం కావాలి.

+ ప్రాథమికంగా చూస్తే పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడిన అంశం. మూడు లక్షల మంది విద్యార్థుల పరీక్ష పత్రాల రీవాల్యుయేష‌న్ కున్న మార్గాలేమిటో కూడా చెప్పాలి.