Begin typing your search above and press return to search.

సీఎం‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ ... జైలుకెళ్లొచ్చిన కేసులో కొత్త చిక్కులు !

By:  Tupaki Desk   |   24 Dec 2020 10:18 AM GMT
సీఎం‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ ... జైలుకెళ్లొచ్చిన కేసులో కొత్త చిక్కులు !
X
కర్ణాటక ముఖ్యమంత్రి య‌డియూర‌ప్ప మళ్లీ కొత్త చిక్కుల్లో పడ్డారు. ఇప్పట్లో నాయకత్వ మార్పు లేదు అంటూ కేంద్రం స్పష్టం చేయడంతో కొంచెం రిలీఫ్ అవుతున్న యడియూరప్ప కి మళ్లీ కొత్త సమస్యలు మొదలైయ్యాయి. బెళ్లందూరు డీ నోటిఫికేష‌న్ విచార‌ణ ర‌ద్దుకు హైకోర్టు అంగీక‌రించ‌లేదు. బెంగ‌ళూరులోని బెళ్లందూరు, దేవ‌ర బీస‌న‌హ‌ళ్లిలో ఐటీ కారిడార్ కోసం క‌ర్ణాట‌క పారిశ్రామిక‌ ప్ర‌దేశాభివృద్ధి మండ‌లి స్వాధీనం చేసుకున్న భూముల‌ను య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వం గ‌తంలో డీ నోటిఫై చేసిన విష‌యం తెలిసిందే.

ఈ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందంటూ లోకాయుక్తకు ఆర్టీఐ కార్యకర్త వాసుదేవరెడ్డి ఫిర్యాదు చేశారు. తనపై లోకాయుక్త కోర్టులో ఉన్న కేసును రద్దు చేయాలంటూ 2019లోనే యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించగా తాజాగా ఆయనకు చుక్కెదురైంది. కోర్టు ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఈ కేసు విచార‌ణ జ‌ర‌గాల‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. 2008-19 మ‌ధ్య కాలంలో యడియూర‌ప్ప ఈ కేసు కార‌ణంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కోల్పోవ‌డంతో పాటుగా జైలు పాలైన సంగతి తెలిసిందే.