Begin typing your search above and press return to search.
కోర్టులు తెరిచేందుకు తెలంగాణ హైకోర్టు ఓకే
By: Tupaki Desk | 9 Nov 2020 3:45 AM GMTకరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టుల్ని పాక్షికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇటీవల కాలంలో కేసుల నమోదు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోర్టుల్ని తెరిచేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు డిసెంబరు 31 వరకు న్యాయస్థానాలు అనుసరించాల్సిన అన్ లాక్ విధానాల్ని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో ఇప్పటికే భౌతికంగా కేసుల విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. తాజా ఆదేశాలతో హైదరాబాద్ జిల్లాలోని సివిల్.. క్రిమినల్ కోర్టుల్నితెరవాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాల్ని జారీ చేసింది. వివిధ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఎంపీ.. ఎమ్మెల్యేల కేసుల విచారణను వేగవంతం చేయాలని చెప్పింది.
హైకోర్టు విధించిన గడువుకు కట్టబడి విచారణ నిర్వహించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణ షురూ కావటమే కాదు.. వేగవంతం కానుందని చెప్పకతప్పదు. మరి.. వేగంగా సాగే విచారణ ఎంతమందికి ఇబ్బందికరంగా మారుతుందో కాలమే చెప్పాలి.