Begin typing your search above and press return to search.
కేసీఆర్ అనుకున్నట్టే అంతా జరుగుతోంది..
By: Tupaki Desk | 9 March 2019 4:24 AM GMTకేసీఆర్ అనుకున్నట్టే జరుగుతోంది. హైకోర్టు విభజిస్తే ఏం లాభం అని ప్రశ్నించిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరుకుతోంది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో పాలన ఎలా ముందుకెళ్తోంది. కోర్టు కేసులు ఎంత త్వరగా పరిష్కారం అవుతున్నాయో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి నాలుగున్నరేళ్లు గడిచిన తెలంగాణ - ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పడలేదు. హైదరాబాద్ లోనే ఉమ్మడి హైకోర్టు సేవలందించింది. ఇందులో ఆంధ్రా - తెలంగాణ న్యాయమూర్తులు ప్రభుత్వాలపై వచ్చిన పిటీషన్లను విచారించారు. కానీ ఈ నాలుగున్నరేళ్లు టీఆర్ ఎస్ సర్కారుకు ఎన్నో ఎదురుదెబ్బలు.. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలు - ఉద్యోగ నియామకాలపై ప్రతిపక్షాలు కోర్టుకెక్కడం వాటిని కోర్టు స్టే ఇచ్చి ఆపేయడం జరిగిపోయింది. ఎక్కడా తెలంగాణ కోణంలో హైకోర్టు తీర్పులు రాకపోయేసరికి ఉమ్మడి హైకోర్టును విభజించాలని.. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్ సహా ఎంపీలంతా కొట్లాడారు. చివరకు సార్వత్రిక ఎన్నికలకు ముందర సుప్రీం కోర్టు తెలంగాణ - ఏపీలో వేరువేరుగా హైకోర్టులను ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రత్యేక హైకోర్టు ఏర్పడగానే అందరికంటే ముందు సంతోషించింది కేసీఆర్ అండ్ టీఆర్ ఎస్ టీమే. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వ నిర్ణయాలు ఉమ్మడి హైకోర్టులో ఆంధ్రా లాబీయింగ్ వల్ల స్టేలు వచ్చాయన్నది కేసీఆర్ - టీఆర్ ఎస్ ఆరోపణ. ఇప్పుడా బాధ తీరింది. వరుసగా ప్రభుత్వ అనుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయి. కేసీఆర్ అనుకున్నట్టే సాగుతోంది.
గతంలో తెలంగాణలోని మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీనంపై ఉమ్మడి హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మున్సిపల్ లో విలీనం కాని గ్రామాల్లో ఈసారి పంచాయతీ ఎన్నికలు జరగలేదు. అలా అని అవి మున్సిపాలిటీలో విలీనం కాలేదు. దీంతో పాలన పడకేసింది. మున్సిపాలీటీల్లో కూడా ఎన్నికలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ అతిపెద్ద అడ్డంకిని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గ్రామాలను విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి.. వెంటనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే కాదు.. ఇటీవల వరుసగా ఉద్యోగ - ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణకు తీపి కబురునందించేలా తీర్పులొస్తున్నాయి. దీంతో కేసీఆర్ అండ్ టీం ఫుల్ హ్యాపీగా ఉందట..