Begin typing your search above and press return to search.
ఎంఐఎం అసదుద్దీన్ కు షాకిచ్చిన హైకోర్టు
By: Tupaki Desk | 10 Jan 2020 10:45 AM GMTపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హైదరాబాద్ లో ర్యాలీ తీయాలని భావించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి గట్టి షాక్ తగిలింది. హైకోర్టు అసదుద్దీన్ గట్టి షాక్ ఇచ్చింది.
సీఏఏని వ్యతిరేకిస్తూ ఎంఐఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో శుక్రవారం భారీ ర్యాలీ చేపట్టారు. అయితే దీనికి అనుమతించ వద్దంటూ హైదరాబాద్ లోని బహదూర్ పురాకు చెందిన నందరాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు సిటీ పోలీసుల అఫిడవిట్ కోరింది. పోలీసులు ఇచ్చిన అనుమతి వరకే కొద్దిమందితోనే ర్యాలీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
అంతేకాకుండా ఈ ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడి అల్లర్లకు పాల్పడే ప్రమాదం ఉందని.. ఈ ర్యాలీని మొత్తం వీడియో తీయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఓవైసీ సహా ఎవ్వరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు పెట్టమని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ర్యాలీతో సత్తా చాటుదామని యోచించిన ఎంఐఎం అధినేత ఓవైసీకి షాక్ తగిలింది.. హైకోర్టు ఆదేశాలతో ర్యాలీ తీయడం కష్టంగా మారింది.