Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో బ్యాక్ టు బ్యాక్ ఎన్నిక‌లు

By:  Tupaki Desk   |   12 Oct 2018 4:47 AM GMT
తెలంగాణ‌లో బ్యాక్ టు బ్యాక్ ఎన్నిక‌లు
X
తెలంగాణ‌లో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయా? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే.. మ‌రో ఎన్నిక‌ల‌కు తెర లేస్తుందా? మొత్తంగా చూస్తే.. ఇప్పుడు మొద‌లైన ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడి.. వ‌చ్చే ఏడాది జూన్ వ‌ర‌కూ నాన్ స్టాప్ గా సాగ‌నుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో బ్యాక్ టు బ్యాక్ ఎన్నిక‌లు తెలంగాణ‌లో జ‌ర‌గ‌నున్నాయి.

ఆగ‌స్టులో పంచాయితీల గ‌డువు ముగిసినా.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించ‌ని నేప‌థ్యంలో మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో గ్రామ పంచాయితీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. పంచాయితీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌కుండా ప్ర‌త్యేక అధికారుల‌తో పాల‌న సాగించ‌టం ఏ మాత్రం స‌రికాదంటూ హైకోర్టు ఆక్షింత‌లు వేసింది. ప్ర‌త్యేక అధికారుల చేత పాల‌న సాగించ‌టం రాజ్యాంగ విరుద్ద‌మ‌న్న హైకోర్టు.. ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

మూడు నెల‌ల వ్య‌వ‌ధిలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని.. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌త్యేక అధికారుల నేతృత్వంలో పాల‌న సాగించొచ్చ‌ని పేర్కొంది. ఈ సంద‌ర్భంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఓట‌ర్ల జాబితాను త‌యారు చేయ‌టంలో ఎన్నిక‌ల సంఘం చిత్త‌శుద్దితో ప‌ని చేయ‌లేద‌న్న విమ‌ర్శ‌ను ఎదుర్కొంది.

తెలంగాణ సర్పంచ్ ల సంఘంతో పాటు ఖ‌మ్మం జిల్లా ఎదులాపురం స‌ర్పంచ్.. ఎంపీటీసీ.. మ‌రికొంద‌రు దాఖ‌లు చేసిన పిటీష‌న్ పై విచార‌ణ జ‌రిపిన సంద‌ర్భంగా హైకోర్టు తాజా తీర్పును ఇచ్చింది. తాజా తీర్పు నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌లు డిసెంబ‌రు 11న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల విడుద‌ల కానున్నాయి. హైకోర్టు తీర్పు నేప‌థ్యంలో జ‌న‌వ‌రి రెండో వారం లోపు పంచాయితీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే.. ఇది జ‌రిగిన మూడు నెల‌ల‌కు మ‌ళ్లీ లోక్ స‌భ ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లవుతుంది. అంటే.. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా జ‌రిగే ఎన్నిక‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం పూర్తిగా వేడెక్క‌నుంద‌న్న మాట‌.