Begin typing your search above and press return to search.

అమరావతి భూసేకరణలో బాబుకు స్పీడ్ బ్రేకర్

By:  Tupaki Desk   |   24 April 2017 11:04 AM GMT
అమరావతి భూసేకరణలో బాబుకు స్పీడ్ బ్రేకర్
X
ఏపీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం ఇప్ప‌టికే వేలాది ఎక‌రాల్ని రైతుల నుంచి సేక‌రించిన చంద్ర‌బాబు స‌ర్కారు.. ఇప్పుడు మ‌రికొన్ని గ్రామాల మీద కూడా దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని ప‌రిధిలోని గుంటూరు జిల్లా తాడేప‌ల్లి మండ‌లం పెనుమాక గ్రామానికి చెందిన 660.83 ఎక‌రాల్ని ప్ర‌భుత్వం సేక‌రించేందుకు వీలుగా నోటిఫికేష‌న్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ భూముల్ని ఇచ్చేందుకు ఇక్క‌డి రైతులు స‌సేమిరా అన్న నేప‌థ్యంలో.. వారి నుంచి భూమి సేక‌రించేందుకు వీలుగా నోటిఫికేష‌న్ జారీ చేశారు. దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న రైతులు.. హైకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపై విచారించిన హైకోర్టు.. ఏపీ స‌ర్కారుకు షాకిచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. భూములు తీసుకునే ప్ర‌య‌త్నాల‌కు చెక్ చెబుతూ.. పెనుమాక భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ పై స్టేట‌స్‌ కో ను విధించింది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించాకే ముందుకు సాగాలని... అంతవరకు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

కాగా తమ భూములను తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పై స్టేట‌స్ కో విధించ‌టంపై పెనుమాక రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ భూములు ఇచ్చేందుకు ఇష్టపడకపోవడంతో ప్రభుత్వం బలప్రయోగం చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు . హైకోర్టు తాజా నిర్ణయం ఏపీ స‌ర్కారుకు తాజా ప‌రిణామం ఇబ్బంది క‌లిగించేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కాగా, హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను పెనుమాక రైతులు స్వాగతించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేసి భూములు గుంజుకునేందుకు ప్రయత్నిస్తోందని వాపోయారు. తమ తరపున పోరాడుతున్నందుకు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ తీర్మానాలు చేసినా పట్టించుకోకుండా భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. ఇలాంటి తీర్పు కోసమే ప్రతీ పేదవాడు, రైతులు, రైతు కూలీలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతన్న వ్యవసాయ పనులు యథాతథంగా కొనసాగించుకునేందుకు న్యాయస్థానం స్పష్టంగా తీర్పునివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తే రాజధాని ముసుగులో అక్రమాలు చేయడానికి వీలుపడదనే బాబు ల్యాండ్ పూలింగ్ తీసుకొచ్చాడన్నది సుస్పష్టంగా అందరికి అర్థమైందని ఆర్కే చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/