Begin typing your search above and press return to search.

ఆదేశాలు అమలు చేయరా? ధిక్కరమా? - తెలంగాణ హైకోర్టు

By:  Tupaki Desk   |   8 Jun 2020 4:55 PM GMT
ఆదేశాలు అమలు చేయరా? ధిక్కరమా? - తెలంగాణ హైకోర్టు
X
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హైకోర్టు ఆగ్రహానికి గురైంది. ఇటీవల కరోనా విషయంలో హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో ముఖ్యంగా పరీక్షలు తగినన్ని చేయకపోవడం గురించి కోర్టు తీవ్ర ఆగ్రహం - ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈపాటికే దీనికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది. వాటిలో ముఖ్యమైనది మరణించిన వారికి సంబంధించిన పరీక్షలు. ఈ విషయం మా ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదు. దీనిని కోర్టు దిక్కారం కింద పరిగణించాల్సి ఉంటుంది అని కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లాం అని... ఏజీ కోర్టుకు తెలిపారు. అక్కడ విచారణలో ఉందన్నారు. ఈ స్పందన పట్ల సంతృప్తి చెందని కోర్టు సుప్రీం తీర్పు వచ్చే వరకు మా ఆదేశాలు అమలు చేయండి అని మరోసారి తీర్పుతెప్పింది. ప్రజారోగ్యం విషయంలో ఇంత నిర్లక్ష్యం తగదు అని పేర్కొంది. మా ఆదేశాలు అమలు కాకకపోతే వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి - ప్రజారోగ్య శాఖ డైరెక్టరును బాధ్యులను చేస్తామని కోర్టు తెలిపింది.

ఇక తెలంగాణలో దేశంలోనే తక్కువ టెస్టులు జరిగాయి. ఇది ప్రభుత్వమే ఒప్పుకునేలా లెక్కలున్నాయి. కొంతకాలం క్రితమే సెకండరీ కాంటాక్టులకు టెస్టులు చేయడం ఆపేశారు. పరీక్షలు ఎందుకు చేయడం లేదని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయినా కేసీఆర్ సర్కారు లెక్క చేయడం లేదు. ఇపుడిది కోర్టు దాకా చేరింది. టెస్టులు చేయమని చెబితే... సుప్రీంకోర్టుకు వెళ్లడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.