Begin typing your search above and press return to search.
పెళ్లి చేసుకుంటానంటూ పిటిషన్..హత్య కేషు దోషికి పెరోల్!
By: Tupaki Desk | 24 May 2020 1:30 AM GMTఅతడు హత్యకేసులో దోషిగా నిర్దారించబడి, గత కొన్నేళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే , తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనకు 4 వారాల పెరోల్ ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సమాజంలో తనకూ కుటుంబ సంబంధాలున్నాయని, వాటిని కొనసాగించేందుకు సరైన జోడీని వెతుక్కుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న పిటిషన్ లో పేర్కొన్నాడు. అతని పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు నాలుగు వారాల పెరోల్ మంజూరు చేసింది.
2005 నుంచి సుదీర్ఘ కాలంగా జైలు జీవితం గడుపుతున్న కారణంగా, విపరీతమైన ఒత్తిడి, మానసిక ఆందోళనకి గురవుతున్నానని, ఈ మహమ్మారి కారణంగా అది మరింత ఎక్కువైందని సదరు దోషి తన పిటిషన్ లో తెలిపాడు. కాబట్టి కొంత రిలీఫ్ పొందడం కోసం తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తన కుటుంబ సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నట్టు తెలిపాడు. ఆ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ప్రతీక్ అతనికి 4 వారాల పాటు షరతులతో కూడిన పెరోల్ మంజూరు చేశారు.
పిటిషనర్ సమాజంలో కుటుంబ సంబంధాలను కలిగి ఉన్నాడు. ఆ సంబంధాలను కొనసాగించేందుకు పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తన విడుదల అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని తలపెట్టేదిగా కనిపించట్లేదు. కాబట్టి అతను కోరినట్టు 4 వారాల పెరోల్ మంజూరు చేస్తున్నాం అని జస్టిస్ ప్రతీక్ వెల్లడించారు. డిసెంబర్,2019లో జైలు అధికారులు తన పెరోల్ దరఖాస్తును తిరస్కరిండంతో అతను కోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాత జనవరిలో కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. అయితే, ఈ వైరస్ నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలకు పరిమితులు విధించడంతో ఆ పిటిషన్ విచారణకు రాలేదు.
ఇటీవల అతని పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఏడాది కాలంగా జైల్లో అతను సత్ప్రవర్తన కలిగి ఉండటంతో పెరోల్ మంజూరు చేసింది. ఇక ఇదే సమయంలో దోషి విడుదల సమయంలో.. తిరిగి లొంగిపోయే సమయంలో ఆరోగ్యపరంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు జైలు అధికారులను ఆదేశించింది. అలాగే వారానికి రెండుసార్లు.. ప్రతీ సోమవారం, గురువారం ఉదయం 11గంటల నుంచి 11.30గంటల మధ్యలో పిటిషనర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్, పీఎస్ సివిల్ లైన్స్ కు వీడియో కాల్ చేసి తన లొకేషన్ కు సంబంధించి గూగుల్ మ్యాప్ ను షేర్ చేయాలి అని ఆదేశించింది.